Ghaati Release Glimpse: అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటీ’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నుండి వస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సున్నితమైన కథలను తెరకెక్కించే డైరెక్టర్ క్రిష్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందని తెలియదంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే నేడు విడుదల చేసిన ఘాటీ యాక్షన్ గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అనుష్క ని ఈ రేంజ్ మాస్ యాంగిల్ లో ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు.
అప్పట్లో విజయశాంతి ని మాత్రమే డైరెక్టర్లు ఇలా చూపించేవారు. ఇప్పుడు ఆ స్థానం లోకి అనుష్క చేరింది. ఇకపోతే నెడు రిలీజ్ గ్లింప్స్ వీడియో ని రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసాడు. ఈ గ్లింప్స్ వీడియో ప్రారంభం నుండే ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ తో మంచి హై తో మొదలు అవుతుంది. ఆ ఈ గ్లింప్స్ ని చూస్తున్నంతసేపు ఈ చిత్రానికి నిజంగానే క్రిష్ దర్శకత్వం వహించాడా అనే సందేహం రాక తప్పదు. ఆయన స్టైల్ మేకింగ్ ఇది కాదు. తన సినిమాల్లో ప్రతీ సన్నివేశాన్ని ఒక పద్యం లాగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు క్రిష్. ఇకపోతే నేడు విడుదల చేసిన గ్లింప్స్ లో అనుష్క చేసిన స్తంట్స్ ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో డైరెక్టర్ క్రిష్ ఇదే చెప్తాడు.
అనుష్క ఎక్కడా కూడా దూప్స్ ని వాడేందుకు ఇష్టపడలేదు. అన్నీ ఆమె తన సొంతంగానే చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ లో అనుష్క రైల్వే బ్రిడ్జి మీద నుండి దూకడం ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. సినిమాలో ఇలాంటి స్తంట్స్ బోలెడన్ని ఉంటాయట. ఇక గ్లింప్స్ చివర్లో అనుష్క చెప్పే ‘వాళ్ళు ఊరుకోరు..వీళ్ళు ఊరుకోరు అంటే..నేను ఊరుకోను’ అని అనుష్క చెప్పే డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా అనిపించింది. మొత్తానికి రేపు చాలా కాలం తర్వాత ఒక మినిమం గ్యారంటీ రేంజ్ సినిమాని మనం వెండితెరపై చూడబోతున్నాము అన్నమాట. గ్లింప్స్ లో చూపించినట్టుగానే సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తీసుకుంటే కచ్చితంగా అరుంధతీ రేంజ్ హిట్ అవుతువుందని అంటున్నారు విశ్లేషకులు.