Ghaati First Day Collections: డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని,తన కంఫర్ట్ జోన్ ని పూర్తిగా దాటి చేసిన చిత్రం ‘ఘాటీ'(Ghaati Movie). అనుష్క(Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు విడుదలకు ముందు అంచనాలు ఒక మోస్తారుగానే ఉండేవి. థియేట్రికల్ ట్రైలర్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ, మొన్న ప్రభాస్ చేత విడుదల చేయించిన సరికొత్త గ్లింప్స్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలం లో ఇలాంటి మాస్ మసాలా సినిమాలు చూసి చాలా కాలం అయ్యింది, కాస్త పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తుంది అని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫలితంగా ఓపెనింగ్స్ పై తీవ్రమైన ప్రభావం పడింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అనుష్క చివరి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’ 2018 వ సంవత్సరం లో విడుదలై మొదటి రోజున 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 6 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి అనుష్క చాలా కాలం తర్వాత చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కనీస స్థాయి వసూళ్లు వస్తాయని అనుకున్నాం. కానీ ఇంత దారుణమైన గ్రాస్ వసూళ్లు వస్తుందని ఊహించలేదు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా పాతిక కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల గ్రాస్ వసూళ్లు రెండు కోట్ల 50 లక్షలు వచ్చాయి. అంటే షేర్ కోటి 50 లక్షల రేంజ్ లోనే ఉంటుంది.
ఇది బ్రేక్ ఈవెన్ కి సంకేతం కాదు, ఘోరమైన డిజాస్టర్ కి సంకేతం. దాదాపుగా 70 నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఈ చిత్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలే ఈ ఏడాది మన టాలీవుడ్ లో సూపర్ హిట్స్ లేవు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో తీవ్రమైన సంక్షోభం లో చిక్కుకుంది. ఇలాంటి సమయం లో ఘాటీ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యి టాలీవుడ్ ని రక్షిస్తుందని అందరూ ఆశపడితే, ఈ సినిమా మరింత నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం నుండి వచ్చిన మొట్టమొదటి టీజర్ ని చూసి ఆడియన్స్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. హైప్ వేరే లెవెల్ కి వెళ్ళింది. అదే మోడ్ లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి ఉండుంటే కనీసం ఓపెనింగ్ వసూళ్లు అయినా ఈ చిత్రానికి వచ్చి ఉండేవి.