Homeఎంటర్టైన్మెంట్Getup Srinu- Yedukondalu: ఏడుకొండలు ఆరోపణలపై నోరు విప్పిన గెటప్ శ్రీను.. షాకింగ్...

Getup Srinu- Yedukondalu: ఏడుకొండలు ఆరోపణలపై నోరు విప్పిన గెటప్ శ్రీను.. షాకింగ్ నిజాలు

Getup Srinu- Yedukondalu: జబర్దస్త్‌ షోలో సాధారణంగా జోకులు నవ్వులు వినిపిస్తాయి. కానీ, ప్రస్తుతం మాటల మంటలు.. విమర్శలు విద్వేషాలు కనిపిస్తున్నాయి. అంతా ఒక్కచోట ఒక్కటిగా వచ్చిన వాళ్లే, ఇప్పుడు బద్ధ శత్రువుల్లా రోడ్డున పడ్డారు. నోటికొచ్చినట్లు పరుష పదజాలంతో విరుచుకు పడుతున్నారు. తప్పు ఎవరిది ? ఒప్పు ఎవరు ? అనే సంగతి పక్కన పెడితే.. ఎవరూ తగ్గడం లేదు. వ్యక్తిగత ఆరోపణలతో దారుణమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ‘మేం చేసింది కాదు కామెడీ, ఇది అసలు సిసలైన కామెడీ’ అన్నట్టుగానే సాగుతుంది జబర్దస్త్‌ నటులు, మేనేజర్ల వ్యవహారం.

Getup Srinu- Yedukondalu
Getup Srinu

‘జబర్దస్త్‌ మాకు కన్నతల్లి అని చెప్పినోడు కూడా ఇప్పుడు నోరు పారేసుకుంటున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు. కానీ ఈ క్రమంలో వీరు అందుకుంటున్న తిట్లదండకమే చాలా అసభ్యకరంగా ఉంటుంది. జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా ఎదిగిన వ్యక్తుల్లో ‘కిరాక్ ఆర్పీ’ కూడా ఒకడు. నెల్లూరు యాసతో టీమ్ లీడర్ గా ఎదిగిన ఈ కిరాక్ ఆర్పీ ‘జబర్దస్త్ షో నీఛం.. దరిద్రం’ అంటూ.. ఆ షో నిర్మాత అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి పై విరుచుకుపడ్డాడు. ఇక్కడ మొదలైన రాద్దాంతం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Also  Read: Celebrities Wedding On and Off Screen: సినిమాల్లో, బయట కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు వీళ్లే

కిరాక్ ఆర్పీ పై రాం ప్రసాద్.. హైపర్ ఆది.. షేకింగ్ శేషులు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆర్పీ వ్యాఖ్యలు, అతను తప్పుడు మనిషి అంటూ వీరంతా ఖండించారు. ముఖ్యంగా షేకింగ్ శేషు ఓ అడుగు ముందుకు వేసి, కిరాక్ ఆర్పీ బండారం మొత్తం బయటపెట్టాడు. అతని పై పర్సనల్ అటాక్ చేశాడు. దాంతో, కిరాక్ ఆర్పీ షేకింగ్ శేషు పై బండబూతులతో విచ్చలవిడిగా రెచ్చిపోయి తిట్టాడు.

ఈ మధ్యలో జబర్దస్త్ మేనేజర్‌ గా పాపులర్ అయిన ఏడుకొండలు కిరాక్ ఆర్పీని ఓరేంజ్‌లో తిట్టిపారేశాడు. పనిలో పనిగా.. జబర్దస్త్ వీడి వేరే ఛానల్‌లో షోలు చేస్తున్న సుడిగాలి సుధీర్, గెటప్ శీనులపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ వారిని కూడా ఏకిపారేశాడు. పైగా సుధీర్, గెటప్ శీను లాంటి వాళ్లకు తాను అప్పట్లో తలో పది లక్షలు ఇప్పించానని, తనకు తాను బిల్డప్ ఇచ్చుకున్నాడు. దాంతో తాజాగా ఏడుకొండలకి గెటప్ శీను కౌంటర్ ఇచ్చాడు.

Getup Srinu- Yedukondalu
Sudigali Sudheer – Yedukondalu

‘నేను అమ్మాను అని చెప్పడానికి.. ఇచ్చేశాను అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉందయ్యా.. కెమెరా ఉంటే సాలు సృహ లేకపోతే ఎలాయ్యా’.. అంటూ కొండలు ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు. శ్రీను ఇలా కామెంట్ చేయడానికి కారణం ఉంది. ‘ఏడుకొండలు ఇంటర్వ్యూలో గెటప్ శీను గురించి ప్రస్తావిస్తూ.. గెటప్ శ్రీను.. తనని రెమ్యునరేషన్ ఎక్కువ పెంచమని అడుగేవాడని.. కారు కొనుక్కోవాలి అని బాధ పడినప్పుడు.. తన కారు ఇచ్చేశానని ఏడుకొండలు చెప్పుకొచ్చాడు. ఐతే, ‘ఇచ్చేశాను అనడానికి, అమ్మాను అనడానికి చాలా వ్యత్యాసం ఉందయ్యా’ అంటూ గెటప్ శీను తాజా ఒక పోస్ట్‌ పెట్టాడు. పైగా డైరెక్ట్‌గా ఏడుకొండలు ఫొటోని పెట్టి.. ‘నేను చేసిన బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్‌కి ఇతనే స్పూర్తి’ అంటూ గెటప్ శ్రీను ఏడుకొండలు గాలి తీసేశాడు. ఈ జబర్దస్త్‌ వివాదం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.

Also  Read:Hari Hara Veera Mallu- Rajamouli: ‘హరి హర వీర మల్లు’ కోసం రంగం లోకి దిగిన రాజమౌళి..పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఇక పండగే

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular