VV Vinayak: ప్రముఖ టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దాని పేరు గీత.మ్యూట్ విట్నెస్. విశ్వ తొలి చిత్రంగా వస్తోన్న ఈ సినిమా గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్ ఇందులో హీరోయిన్గా కనిపించనుంది. ప్రముఖ నటుడు సనీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ప్రేమించు, నువ్వే కావాలి వంటి సినిమాల్లో హీరోగా పరిచయమైన కిరణ్ ఇందులో విలన్‌గా దర్శనమివ్వనున్నాడు.

ప్రస్తుతంం షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుంది చిత్రంబృందం. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వివి వినాయ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న గీత ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: ఆ హీరో ఫెయిల్యూర్ కి కారణం అతనే !
మరోవైపు దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. తన గురువు, దైవం, వివి వినాయక్ ఈ సినిమా అవకాశం ఇప్పించారని అన్నారు. రాచయ్యకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తున్న ఛత్రపతి షూటింగ్లో బిజీగా ఉన్నారు వినాయక్. అయినప్పటికీ.. తన మీద ప్రేమతో గీత సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత. గురువు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా దర్శకుడు విశ్వ.. గీత సినిమాను అత్యద్భుతంగా రూపొందించారని అన్నారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, సంధ్యా జనక్, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read: నాని ఈసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారు అంటున్న దిల్ రాజు…