Homeఎంటర్టైన్మెంట్Gayapadda Simham Movie Review: 'గాయపడ్డ సింహం' ఫుల్ మూవీ రివ్యూ...బొమ్మ హిట్టా..?ఫట్టా..?

Gayapadda Simham Movie Review: ‘గాయపడ్డ సింహం’ ఫుల్ మూవీ రివ్యూ…బొమ్మ హిట్టా..?ఫట్టా..?

Gayapadda Simham Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలు వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటుంటే కుర్ర హీరోలు కూడా వాళ్ళ సత్తాను చాటుతూ తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద విజయాలను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటుడిగా మారి చేస్తున్న సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయన చేసిన ‘గాయపడ్డ సింహం’ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

చిన్నప్పటి నుంచి అమెరికాకు వెళ్లాలనుకున్న తరుణ్ భాస్కర్… ఎట్టకేలకు తన లవర్ కోసం అమెరికాకు వెళ్తాడు… కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టిన కొన్ని కండిషన్స్ వల్ల ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తాడు. దాంతో ట్రంప్ పెట్టిన కండిషన్స్ వల్ల తను మళ్ళీ అమెరికాకు వెళ్లకుండా అవుతాడు. ఇక అప్పటికే విసిగిపోయిన తరుణ్ ట్రంప్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. మొత్తానికైతే ఆయన ట్రంప్ మీద రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఈ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఫన్ తో నడిపించాలని చూశాడు…అందులో చాలా వరకు ఆయన సక్సెస్ అయ్యాడు…కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు సైతం దానికి ఈజీగా కనెక్ట్ అయిపోయారు… హైదరాబాద్ లో ఉండే వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ మీద రివెంజ్ తీర్చుకోవడం అనే పాయింట్ చాలా మందికి కనెక్ట్ అయింది…

ప్రతి సీన్ లో ఒక ఇంటెన్సిటీ అయితే చూపించాడు…ప్రతి క్యారెక్టర్ లో డెప్త్ తీసుకోవడానికి దర్శకుడు చాలానే కష్టపడ్డాడు… కొన్ని కామెడీ సన్నివేశాల్లో సెపరేట్ బిజిఎం వేశారు చాలా బాగుంది… ఇక సెకండాఫ్ లో వచ్చే స్పూఫ్ ఎపిసోడ్స్ అలాగే చిరంజీవి కాష్మోరా సాంగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ గా నిలిచాయి… క్లైమాక్స్ కూడా సాటిస్ఫై చేసే విధంగానే ఉంది… ఇక ఈ మూవీ లో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. శ్రీ విష్ణు క్యామియో కూడా కథలో భాగంగా రావడం ప్రేక్షకులకు బాగా నచ్చింది.

ఫస్టాఫ్ లో మొదటి 30 నిమిషాలు పూర్తయిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని కొంత వరకు నిరాశ పరిచిన కూడా వెంటనే కొన్ని కామెడీ సీన్స్ తో సినిమాను గాడిలోకి తీసుకువచ్చాడు. అయినప్పటికి మ్యూజిక్ ఈ సినంకి చాలా వరకు మైనస్ అయింది… మొత్తానికైతే సెకండాఫ్ ఈ సినిమాను నిలబెట్టింది…అందులో వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కనెక్ట్ అయింది… ఓవరాల్ గా దర్శకుడు ఏదైతే తీయాలనుకున్నాడు దాన్ని ఎక్కడ కన్ఫ్యూజన్స్ లేకుండా చెప్పే ప్రయత్నం చేశాడు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

తరుణ్ భాస్కర్ ఈ మధ్య కాలం లో చేస్తున్న సినిమాల్లో ఏ సినిమా కూడ ఆయనకి అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కావడం లేదు… కానీ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ను తను చాలా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేశాడు… శ్రీవిష్ణు పాత్ర ను చాల డిఫరెంట్ గా మలిచారు. దాంతో సినిమా స్టోరీ కి లింక్ చేయడమనేది మామూలు విషయాల్లో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ కూడా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడం లో హెల్ప్ అయింది.

చాలా రోజుల తర్వాత చక్రవర్తి చాలా సేపు రన్ టైమ్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. ఇక ఫరియా అబ్దుల్లా సైతం ఇంతకు ముందు చేసిన అన్ని సినిమాల్లో ఏదో మిస్ అవుతుంది అనిపించేది. కానీ ఈ సినిమాలో తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది…మానస చౌదరి క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. ఆమె కూడా కొంతవరకు మెప్పించింది…ఇక మిగిలిన పాత్రల్లో నటించిన ప్రతి ఒకరు సినిమా సక్సెస్ లో బాగమయ్యారనే చెప్పాలి…

టెక్నికల్ అంశాలు…

ఈ సినిమా మ్యూజిక్ కొంతవరకు మైనస్ అయింది…కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒకే అనిపించింది… డీఓపి వర్క్ బాగుంది ప్రతి సీన్ ను చాలా బాగా చేశారు…ఎడిటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు…ఇక మూవీ ప్రొడక్షన్ వాల్లు కూడా బాగున్నాయి…

ఈ సినిమాలో బాగున్నవి…

తరుణ్ భాస్కర్ యాక్టింగ్
మూవీ కాన్సెప్ట్
సర్ విష్ణు క్యామియో

ఈ మూవీలో బాగోలేనివి

మ్యూజిక్
ఫస్టాప్ లో కొన్ని సీన్స్

రేటింగ్ 2.5/5

బాటమ్ లైన్ : ఈ వీకెండ్ ఫ్యామిలీ తో కలిసి చూసి ఎంజాయ్ చేయవచ్చు…

 

Gaayapadda Simham - Official Trailer | Tharun Bhascker | JD Chakravarthy | Sree Vishnu

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version