Singer Sidhu Sketch On Karan Johar: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. సింగర్ సిద్దు మూసేవాలా హత్య కేసులో అరెస్ట్ కాబడిన గ్యాంగ్ సభ్యులు విచారణలో షాకింగ్ విషయాలు బయటపెడుతున్నారు. మే 29న కాంగ్రెస్ నేత, ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలాను కొందరు దుండగులు కాల్చి చంపారు. ఆయన ప్రయాణిస్తున్న జీపును అడ్డగించి డ్రైవింగ్ సీట్లో ఉన్న సిద్దు పై 30 రౌండ్ల కాల్పులు జరిపారు. సిద్దు మూసేవాలా అక్కడిక్కడే మరణించారు.

Also Read: Agneepath: ‘అగ్నిపథ్ ’పై ఆలోచిస్తే అంతా మంచికే..
సిద్దు హత్య తమ పనే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తో పాటు కెనడా బేస్డ్ గ్యాంగ్ స్టర్ గోల్డి బ్రార్ కలిసి సిద్దు హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ హత్యలో పాల్గొన్న సిద్దేష్ కామ్లే పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తుంది. ఈ గ్యాంగ్ ఏకంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారట.

కరణ్ జోహార్ ని కిడ్నాప్ చేసి… రూ. 5 కోట్లు డిమాండ్ చేయాలని భావించారట. ఆ ప్లాన్ అమలు కాక ముందే సిద్దుని మర్డర్ చేయాల్సి వచ్చినట్లు సిద్దేష్ కామ్లే తెలియజేశారు. అలాగే సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉంది. కృష్ణజింకలను వేటాడిన కేసును ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్ ని చెంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ 2018లో ప్రకటించింది. అలాగే సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ పై ఈ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పపడింది. దేశంలోనే డేంజరస్ గ్యాంగ్ గా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తయారైంది. జైలు నుండే ప్రముఖులపై దాడికి ప్రణాళికలు వేస్తున్న వీళ్ళ నెట్వర్క్ చూసి అధికారులే విస్తుపోతున్నారు.
[…] Also Read: Singer Sidhu Sketch On Karan Johar: కరణ్ జోహార్ పై భారీ స్కె… […]
[…] Also Read: Singer Sidhu Sketch On Karan Johar: కరణ్ జోహార్ పై భారీ స్కె… […]