Gandeevadhari Arjuna OTT: గని సినిమా డిజాస్టర్ కావడంతో తన ఆశలన్నీ వరుణ్ తేజ్ గాంధీవదారి అర్జున్ పైన పెట్టుకున్నాడు. కానీ గని సినిమా కన్నా ఫ్లాప్ ఇంక వరుణ్ కెరియర్ లో రాకూడదు అనుకుంటున్న టైంలో.. వరుణ్ అలానే ఆయన అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ.. గాంధీవదారి అర్జున్ అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు వెళ్ళిందో సగం మంది ప్రేక్షకులకు తెలియదు అంటేనే ఈ సినిమా ఎంతటి ఘోర పరాజయం చవిచూసిందో అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాని త్వరగా నే ఓటీటీ రిలీజ్ కి ఇచ్చేశారు ఈ చిత్ర మేకర్స్.
తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ “ఓ టి టి” సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని సెప్టెంబర్ 24 వ తేదీన నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
ఇక ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ రోప్ షాట్స్, ఛేజింగ్ సీన్స్ లో గట్టిగానే కష్టపడ్డాడు. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడ లేక పోయింది. మరి ఓటిటి లో అన్న ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి