Gandeevadhari Arjuna Review: హీరో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునగా థియేటర్స్ లోకి దిగారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా విడుదలకు ముందు ఆసక్తి రేపింది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు. మరి గాండీవధారి అర్జునుడు యుద్ధం గెలిచాడా లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్(నాజర్) ఒక బడా కంపెనీ వలన పర్యావరణం నాశనం అవుతుందని గ్రహిస్తాడు. ఆ సంస్థను మూసి వేయాలి. లేదంటే మానవజాతి మనుగడకే ముప్పు అని భావిస్తాడు. ఆ ప్రయత్నాల్లో ఉన్న ఆదిత్య రాజ్ ని సదరు కార్పొరేట్ సంస్థ టార్గెట్ చేస్తుంది. ఆదిత్య రాజ్ ని చంపాలని డిసైడ్ అవుతుంది. అప్పుడు బాడీగార్డ్ అర్జున్ వర్మ(వరుణ్ సందేశ్) రంగంలోకి దిగుతాడు. ఆదిత్య రాజ్ ప్రాణాలు కాపాడే బాధ్యత తీసుకుంటాడు. మరి అర్జున్ వర్మ సక్సెస్ అయ్యాడా? ఆదిత్య రాజ్ ని చంపాలనుకుంటుందని ఎవరు? వారికి అర్జున్ వర్మ ఎలా గుణపాఠం చెప్పాడు? అనేది మిగతా కథ…
విశ్లేషణ:
గరుడవేగ మూవీతో ప్రవీణ్ సత్తారు టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. ఫార్మ్ లోని హీరో రాజశేఖర్ తో సూపర్ హిట్ కొట్టాడు. ప్రవీణ్ సత్తారు సినిమాల్లో విషయం ఉంటుందనే ఓ నమ్మకం కలిగేలా చేశాడు. అయితే గోస్ట్ మూవీతో భారీ ప్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కథను నమ్మి అవకాశం ఇచ్చాడు. గాండీవధారి అర్జున విషయంలో ప్రవీణ్ సత్తారు సక్సెస్ అయ్యాడా అంటే కొంత మేరకు మాత్రమే. యాక్షన్ థ్రిల్లర్స్ లో బలమైన కథ ఉండాల్సిన అవసరం లేదు. అద్భుతమైన స్క్రీన్ ప్లే, విజువల్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తే చాలు.
ముఖ్యంగా పరుగులు పెట్టే కథనం అవసరం. ఈ చిత్రంలో అదే ప్రధాన మైనస్. ప్రవీణ్ సత్తారు ఫ్లాట్ నెరేషన్ అంత ఇంప్రెసివ్ గా లేదు. సినిమా ఆద్యంతం ప్రిడిక్టబుల్ గా సాగుతుంది. ఒక రొటీన్ ఫార్మాట్ లో నడిపించేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కూడా ఎలాంటి హై ఉండదు. ఇంటర్వెల్ మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తిరేపేలా ఉంది. సెకండ్ హాఫ్ లో సినిమా పుంజుకుంటుందని ఎదురు చూసిన ప్రేక్షకులు పూర్తిగా సంతృప్తి చెందలేదు.
అయితే అక్కడక్కడ అద్భుతమైన విజువల్స్ పడ్డాయి. కెమెరా వర్క్ బాగుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బీజీఎమ్ విషయంలో ఆయన ఆకట్టుకున్నారు. లండన్ లో తెరకెక్కించిన సన్నివేశాలు చాలా రిచ్ గా ఉంటాయి. ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి.
వరుణ్ తేజ్ బాడీగార్డ్ రోల్ లో బాగా కుదిరాడు. ఆయన యాక్టింగ్, మేనరిజం పాత్రకు సహజంగా కుదిరింది. వరుణ్ తేజ్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఇక సాక్షి వైద్య పూర్తి నిడివి కలిగిన రోల్ దక్కించుకుంది. అయితే ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయ్యేలా ఆమె పాత్ర లేదు. విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ కీలకమైన పాత్రల్లో మెప్పించే ప్రయత్నం చేశారు.
ప్లస్ పాయింట్స్:
విజువల్స్
యాక్షన్ సన్నివేశాలు
వరుణ్ తేజ్ ప్రెజెన్స్
బీజీఎం
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
కథ
ఫ్లాట్ నెరేషన్
సినిమా చూడాలా వద్దా?: దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ స్టైలిష్ అండ్ రిచ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లేని ఫ్లాట్ నేరేషన్ ఇబ్బంది పెట్టింది. అయితే యాక్షన్ మూవీ లవర్స్ ఎంజాయ్ చేసే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. వరుణ్ తేజ్ ప్రెజెన్స్ బాగుంది. యాక్షన్ చిత్రాలు ఇష్టపడే వారు ఓసారి చూడొచ్చు…
రేటింగ్: 2.75/ 5