https://oktelugu.com/

Game Changer Movie : హిందీ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా #RRR ని దాటేసిన ‘గేమ్ చేంజర్’..ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ సినిమాకి ఎవ్వరూ ఊహించని విధంగా హిందీ లో అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అవ్వడం ట్రేడ్ విశ్లేషకులను సైతం షాక్ కి గురయ్యేలా చేసింది. అది కూడా మాములు రేంజ్ ట్రెండ్ కాదు. #RRR చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోతే, గేమ్ చేంజర్ చిత్రానికి ఏకంగా లక్షా 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం గమనార్హం.

Written By:
  • Vicky
  • , Updated On : January 9, 2025 / 09:54 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer Movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరి కొద్దీ గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అభిమానులు ఈ చిత్రం పై కోటి ఆశలు పెట్టుకున్నారు. #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం తో ఆయన ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరాలని బలమైన ఆశతో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే థియేట్రికల్ ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ సబ్జెక్టు సినిమాలు అంటే యూత్ ఆడియన్స్ కి మొదటి నుండి కాస్త తక్కువ ఆసక్తి ఉంటుంది. అందుకే ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ వసూళ్లు అయితే ఈ సినిమాకి వచ్చే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. దానికి తోడు నార్త్ అమెరికా లో ‘చలి తుఫాను’ అన్ని రాష్ట్రాల్లో విపరీతంగా ఉండడం, జనాలు బయటకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది.

    అయినప్పటికీ కూడా రేపు ఈ చిత్రానికి పబ్లిక్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కచ్చితంగా ఓవర్సీస్ నుండి 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. నిన్న రాత్రే బుకింగ్స్ ని మొదలు పెట్టారు. తెలంగాణ లో అయితే అర్థరాత్రి ప్రారంభించారు. బుకింగ్స్ ఇంత ఆలస్యం అయితే ఓపెనింగ్స్ పై ప్రభావం చాలా బలంగా పడుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి ఆల్ ఇండియా వైడ్ గా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా సమయం ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రం ఈరోజు అర్థరాత్రి సమయానికి కేవలం ఇండియా వైడ్ గ్రాస్ 50 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి ఎవ్వరూ ఊహించని విధంగా హిందీ లో అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అవ్వడం ట్రేడ్ విశ్లేషకులను సైతం షాక్ కి గురయ్యేలా చేసింది. అది కూడా మాములు రేంజ్ ట్రెండ్ కాదు. #RRR చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోతే, గేమ్ చేంజర్ చిత్రానికి ఏకంగా లక్షా 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రానికి మొదటి రోజు హిందీ వెర్షన్ నుండి 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా వస్తాయి. థియేట్రికల్ ట్రైలర్ హిందీ వెర్షన్ లో కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. చూడాలి మరి రేపు ఓపెనింగ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.