Game Changer : రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులకు ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఒక పీడకల. తాము ఎంతో ఇష్టంగా ఆరాధించే రామ్ చరణ్ నుండి ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) లాంటి డిజాస్టర్ ఫ్లాప్ రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే #RRR తర్వాత రాబోతున్న రామ్ చరణ్ సోలో హీరో చిత్రం కావడంతో ఈ సినిమాని అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ శంకర్(Shankar Shanmugham) ఇలాంటి ప్రోడక్ట్ ఇస్తాడని అభిమానులు ఊహించలేకపోయారు. కనీసం ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా గుర్తు తెచ్చుకొని చూసేలా అనిపించలేదు. స్క్రీన్ ప్లే మొత్తం అతుకుల బొంత లాగా అనిపించింది. సన్నివేశాల మధ్య కనెక్షన్ లేదు. బాగా వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ని తొందరగా ముగించేశారు. ఇలా ఎటు చూసినా అభిమానులకు ఈ చిత్రం నిరాశే మిగిలించింది. ఫలితంగా రామ్ చరణ్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చి 50 శాతం కూడా రికవరీ సాధించని సినిమాగా మిగిలింది.
అయితే ఈ చిత్రాన్ని జనవరి 7వ తారీఖున అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో విడుదల చేసారు. థియేటర్స్ లో ఫ్లాప్ గా మిగిలిన ఈ చిత్రానికి ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందేమో అనుకున్నారు కానీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఈ చిత్రం ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడం గమనార్హం. 10 రోజుల నుండి దేశవ్యాప్తంగా టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమాకి ఇప్పటి వరకు 5 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. అమెజాన్ ప్రైమ్ లో గడిచిన కొన్నేళ్ల నుండి స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలన్నిటికంటే ఈ చిత్రానికే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందట. పైగా ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ ఇంకా రాలేదు. హిందీ వెర్షన్ కి అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక ఆడియన్స్ ఉంటారు.
అలాంటి హిందీ వెర్షన్ రాకముందే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే, ఇక హిందీ వెర్షన్ వచ్చాక ఏ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రాన్ని అన్ని భాషలకు కలిపి 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. దాదాపుగా లాభాల్లోకి వచ్చినట్టే. మరో నెల రోజులు ఇలాగే టాప్ 1 స్థానంలో ఈ చిత్రం ట్రెండ్ అయితే, సెన్సేషనల్ రెస్పాన్స్ అనుకోవచ్చు. ఇకపోతే హిందీ వెర్షన్ రావాలంటే మరో రెండు వారాలు ఎదురు చూడాల్సిందే. థియేటర్స్ లో విఫలం అయినప్పటికీ, కనీసం ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నందుకు అభిమానులు కాస్త సంతృప్తి చెందారు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎన్ని వారాలు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ట్రెండ్ అవుతుంది అనేది. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.