Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఘోరమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెగటివ్ టాక్ ప్రభావం సినిమా మీద చాలా బలంగా పడుతుందని అందరూ అనుకున్నారు కానీ, రామ్ చరణ్ స్టార్ స్టేటస్ కారణంగా పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటుంది. పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ మామూలు కమర్షియల్ సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువ ఆసక్తిని చూపిస్తారు. సినిమా బాగుంటే వేరే లెవెల్ కి తీసుకెళ్తారు కానీ, యావరేజ్ రేంజ్ లో ఉన్నా పట్టించుకోరు. అదే ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి జరిగింది. సినిమా విడుదలై నిన్నటితో 6 రోజులు పూర్తి అయ్యింది. ఈ ఆరు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ఆరు రోజులకు గాను 18 కోట్ల 60 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 10 కోట్ల 40 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర జిల్లాలో 9 కోట్ల 60 లక్షలు, గుంటూరు జిల్లాలో 6 కోట్ల 90 లక్షలు, కృష్ణా జిల్లాలో 4 కోట్ల 82 లక్షలు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సినిమాకి 11 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 65 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక లో 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళనాడు లో 3 కోట్ల 50 లక్షలు, నార్త్ ఇండియా లో 17 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 13 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 6 రోజులకు 105 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 185 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంత గ్రాస్ వసూళ్లు ఆరు రోజులకు వస్తే, మూవీ టీం మాత్రం కేవలం మొదటి రోజు వచ్చింది అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ రేపిన దుమారం మామూలుది కాదు. ఆరోజు మొత్తం దేశవ్యాప్తంగా ట్రేడ్ లో ఈ పోస్టర్ గురించే చర్చించుకున్నారు. అంతటి భీబత్సం సృష్టించింది ఈ పోస్టర్. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీం కి పోస్టర్స్ విడుదల చేయడం నాకు ఇష్టం ఉండదు, దయచేసి చేయొద్దు అని రిక్వెస్ట్ చేయడంతో ఆపేసారు.