Emotional Movies: కొన్ని యదార్థఘటనల ఆధారంగనే సినిమాలు తీస్తుంటారు. నిజ జీవితంలో మనకు కలిగే, జరిగే సంఘటనలే వెండితెరపై కనిపిస్తాయి. దీంతో ఆ కథ మన ఇంట్లోనే సాగుతుందన్న భావన కలుగుతుంది. దీంతో మనకు తెలియకుండానే మన కంటి నుంచి నీళ్లు వస్తాయి. అలనాటు వచ్చిన ‘మాతృదేవోభవ’ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని వారు లేదు. అయితే ఎమోషన్స్ ప్రేక్షకులకే కాదు. అలాంటి సీన్లలో నటించే వారికి కూడా ఉంటాయనేది వాస్తవం. వారికి కూడా కొన్ని సినిమాలు చూస్తే తమకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయట. ఓ సందర్భంలో వారు మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎవరెవరు? ఏ సినిమాకు కన్నీళ్లు పెట్టుకున్నారో చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించారు. యాక్షన్ మాత్రమే కాకుండా సెంటిమెంట్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాడు. అయతే ఆయన బాగా కనెక్ట్ అయిన సినిమా ‘శంకారభరణం’. ఓరోజు మంజు భార్గవి గారు ఈ సినిమా ప్రివ్యూ చూడ్డానికి పిలిచారట. ఆ ప్రివ్యూ చూస్తేనే చిరు కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ సినిమా నిజజీవితంలా అనిపించడంతో కన్నీళ్లు ఆగలేదని చిరు చెప్పాడు.
సమంత:
సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ కూడా ఓ సినిమా చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘బంగారు తల్లి’ని చూసి ఆ బాధతో ఏడ్చేసింది. చాలా రోజులుగా అవే సీన్స్ గుర్తుకు రావడంతో నిద్ర పట్టలేదు.
కృతి శెట్టి:
తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన కృతి శెట్టి.. నాగచైతన్యకు జోడీగా ‘బంగార్రాజు’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో తండ్రి లేడన్న దృశ్యం బాధ కలిగించింట. ఈ సీన్స్ చేయాల్సినప్పుడల్లా రియల్ గా ఎంతో ఫీలయ్యానని తెలిపింది.
కియారా అడ్వాణి:
కార్గిల్ యుద్ధం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షేర్షా’ . ఇందులోని కొన్ని దృశ్యాలు కియారాకు కన్నీళ్లు తెప్పించాయి. ఇందులో విక్రమ్ ప్రేయసి డింపుల్ పాత్రలో కియారా నటించింది. ఇందులో విక్రమ్ చనిపోయిన సీన్స్ ఇప్పటికీ చూసినా కన్నీళ్లు వస్తాయని చెబుతోంది.
మహేష్ బాబు:
చిన్న పిల్లలు బాగా ఇష్టపడే మూవీ ‘ద లయన్ కింగ్’. ఇందులోని ప్రతీ సీన్ అంటే మహేష్ కు ఇష్టమట. ఒక కుటుంబం తండ్రి లేకపోతే ఎన్ని బాధలు పడుతుందో జంతువుల రూపంలో చూపించారు. అయినా కళ్లకు గట్టినట్లు సీన్స్ ఉండడంతో మహేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.