Sammathame Movie: కిరణ్ అబ్బవరం “సమ్మతమే” సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల…

Sammathame Movie: విభిన‍్న కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్‌ హీరో కిరణ్‌ అబ‍్బవరం. ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ఆ తర్వాత ప్రియాంక జవాల్కర్ తో కలిసి ఎస్‌ఆర్‌ కళ‍్యాణమండపం అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకోగా… అతని నటనకు మంచి మార్కులు దక్కాయి. అలానే ఈ మూవీలో సాయి కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు తాజాగా మరో రొమాంటిక్‌ […]

Written By: Sekhar Katiki, Updated On : November 29, 2021 11:48 am
Follow us on

Sammathame Movie: విభిన‍్న కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్‌ హీరో కిరణ్‌ అబ‍్బవరం. ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ఆ తర్వాత ప్రియాంక జవాల్కర్ తో కలిసి ఎస్‌ఆర్‌ కళ‍్యాణమండపం అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకోగా… అతని నటనకు మంచి మార్కులు దక్కాయి. అలానే ఈ మూవీలో సాయి కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు తాజాగా మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తో మన ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. ‘సమ్మతమే’ అనే చిత్రంతో అలరించనున్నాడు. ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. యూజీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కె. ప్రవీణ్‌ నిర్మించిన ఈ సినిమాకు గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని మొదటి సింగిల్ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘కృష్ణ అండ్ సత్యభామ’ అంటూ సాగే ఈ పాటలో కృష్ణుడు, సత్యభామల ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో చూపించారు. కిరణ్‌, చాందినీ చౌదరీల రొమాంటిక్‌ ట్రాక్‌ చూడముచ్చటగా అనిపిస్తుంది. శేఖర్‌ చంద్ర సంగీతం ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. సతీష్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాతో పాటు సెబాస్టియన్ అనే మూవీలో కూడా కిరణ్ నటిస్తున్నాడు.