Homeఎంటర్టైన్మెంట్12th Fail: ఇండియాలోనే మొదటి సినిమా... 12th ఫెయిల్ కి అంతర్జాతీయ గుర్తింపు!

12th Fail: ఇండియాలోనే మొదటి సినిమా… 12th ఫెయిల్ కి అంతర్జాతీయ గుర్తింపు!

12th Fail: బాలీవుడ్ లో సంచనాలు చేస్తుంది ఓ చిన్న చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కలెక్షన్స్ కురిపించింది. వసూళ్లకు మించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అదే 12th ఫెయిల్. సీనియర్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 12th ఫెయిల్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథే 12th ఫెయిల్. ప్రస్తుతం ముంబై అడిషనల్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీహార్ కి చెందిన మనోజ్ కుమార్ శర్మ అత్యంత పేద కుటుంబంలో జన్మించాడు.

ఎలాగైనా ఐపీఎస్ ఆఫీసర్ కావాలని పట్టుదలతో ఒడిదుడుకులు ఎదుర్కొని తన లక్ష్యం చేరుకున్నాడు. మనోజ్ కుమార్ బయోగ్రఫీని మనోజ్ కుమార్ శర్మ రూమ్ మేట్ అనురాగ్ పాథక్ 12th ఫెయిల్ పేరుతో రాశారు . ఆ పుస్తకం ఆధారంగా దర్శకుడు విధు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేదికపై 12th ఫెయిల్ చిత్రం మెరిసింది.

ఏకంగా ఐదు విభాగాల్లో ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ క్రిటిక్, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కొల్లగొటింది. కాగా అంతర్జాతీయ స్థాయిలో 12th ఫెయిల్ మూవీ సత్తా చాటింది. ఐ ఎం డి బి ప్రకటించిన టాప్ 100 చిత్రాల జాబితాలో 12th ఫెయిల్ చిత్రానికి చోటు దక్కింది.

ఐ ఎం డి బి 12th ఫెయిల్ చిత్రానికి 9.2 రేటింగ్ ఇచ్చింది. ఐ ఎం డి బి టాప్ 50వ చిత్రంగా 12th ఫెయిల్ ఉంది. ఇప్పటి వరకు ఏ భారత చిత్రానికి ఈ గౌరవం దక్కలేదు. ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. సంతోషం వ్యక్తం చేశాడు. 12th ఫెయిల్ చిత్రంలో ప్రధాన పాత్ర విక్రాంత్ మాస్సే చేశారు. 2023 అక్టోబర్ 27న విడుదలైన 12th వంద రోజుల రన్ పూర్తి చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular