Ranveer Singh FIR: ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం తో ఏకంగా 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన హీరో రణవీర్ సింగ్(Ranveer Singh), ఇప్పుడు కష్టాల్లో చిక్కుకున్నాడు. అనవసరమైన వెక్కిలి చేష్టల కారణంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు నిల్చుకునే పరిస్థితి రాబోతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత ఏడాది నవంబర్ 28న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఈవెంట్ లో రణవీర్ సింగ్ హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే ఆ ఈవెంట్ కి వచ్చిన కాంతారా హీరో రిషబ్ శెట్టి నటన ని ప్రశంసించడంలో భాగంగా, రణవీర్ సింగ్ ఆ చిత్రం లోని దైవకోలా సన్నివేశాన్ని ఇమిటేట్ చేసి చూపించాడు. దీంతో తుళ్లు సంస్కృతి ని అనుసరించే లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సోషల్ మీడియా లో రణవీర్ సింగ్ పై ఒక వారం రోజుల పాటు ట్రోలింగ్స్ జరిగాయి.
తనపై ఏర్పడిన ఈ నెగిటివిటీ ని గమనించిన రణవీర్ సింగ్ సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు కూడా చెప్పుకొచ్చాడు. కానీ హిందూ సంఘాలు మాత్రం రణవీర్ సింగ్ ని క్షమించలేదు. బెంగళూరు ప్రాంతానికి చెందిన న్యాయవాది ప్రశాంత్ మెతల్ , కాంతారా చిత్రం లో పవిత్రమైన దేవుడి సన్నివేశాలను ఎగతాళి చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను రణవీర్ సింగ్ దెబ్బ తీసాడని, ఈ అంశాన్ని తీవ్రంగా భావిచి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పై నేడు విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ కోర్టు , పోలీసులకు రణవీర్ సింగ్ పై కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బెంగళూరు లోని ‘ది హై గ్రౌండ్’ పోలీసులు రణవీర్ సింగ్ పై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు విచారణ కోసం రణవీర్ సింగ్ ని బెంగళూరు పోలీసు స్టేషన్ కి పిలిస్తే కచ్చితంగా రావాల్సి ఉంటుంది, లేని పక్షంలో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి.
ఇకపోతే ఆయన హీరో గా నటించిన ‘ధురంధర్’ చిత్రం నిన్నటి నుండి నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ఈ చిత్రానికి ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో, ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ ఏడాది మార్చి 19 న ఈ సీక్వెల్ విడుదల కాబోతుంది. మొదటి భాగమే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తే , ఇక రెండవ భాగం ఏ రేంజ్ సునామీ నెలకొల్పబోతుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ఆయన తమిళ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది.