https://oktelugu.com/

Kishore Tirumala: ప్చ్.. ఒక్క ప్లాప్ కే ఆ డైరెక్టర్ కి ఫైనాన్సియల్ సమస్యలు

Kishore Tirumala: ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ మీదే నడుస్తుంది. ఒక్క సినిమా అటు ఇటు అయితే ఎంత పెద్ద దర్శకుడికైనా పుకార్లు తప్పవేమో. అనుమానాలు కూడా సహజమే. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’కి ముందు కిషోర్ తిరుమల వేరు. ఇప్పుడు వేరు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అపజయం పాలైంది. అంత ఘోరంగా పరాజయం పాలు అవుతుందని ఎవరూ ఊహించలేదు. దాంతో, కిషోర్ తిరుమలకి ఫైనాన్సియల్ సమస్యలు ఎక్కువయ్యాయని, రవితేజతో అనుకున్న సినిమా ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. Also Read: […]

Written By:
  • Shiva
  • , Updated On : May 8, 2022 / 05:56 PM IST
    Follow us on

    Kishore Tirumala: ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ మీదే నడుస్తుంది. ఒక్క సినిమా అటు ఇటు అయితే ఎంత పెద్ద దర్శకుడికైనా పుకార్లు తప్పవేమో. అనుమానాలు కూడా సహజమే. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’కి ముందు కిషోర్ తిరుమల వేరు. ఇప్పుడు వేరు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అపజయం పాలైంది. అంత ఘోరంగా పరాజయం పాలు అవుతుందని ఎవరూ ఊహించలేదు.

    Kishore Tirumala

    దాంతో, కిషోర్ తిరుమలకి ఫైనాన్సియల్ సమస్యలు ఎక్కువయ్యాయని, రవితేజతో అనుకున్న సినిమా ఆగిపోయిందని ప్రచారం మొదలైంది.

    Also Read: Husband Wife Relationship: భర్త ప్రేమను ఎలా పొందడానికి 6 రహస్యాలు ఇవే

    ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫ్లాప్ కావడం కన్నా ఈ ప్రచారాలు ఆయన్ని ఎక్కువగా వేధిస్తున్నాయి. ఐతే, నిజం ఏంటంటే… కిషోర్ తిరుమల, రవితేజ సినిమా యథావిధిగా ప్రారంభం కానుంది.

    సినిమా ఆగిపోవడం అనేది పూర్తిగా తప్పు. కిషోర్ తిరుమలకి రవితేజ పూర్తి మద్దతుగా ఉన్నారు. టెన్షన్ పడకుండా కూల్ గా స్క్రిప్ట్ పనులు, ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకోమని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు రవితేజ. రెగ్యులర్ షూటింగ్ మాత్రం కాస్త ఆలస్యం కావొచ్చు. ఇంతకు మించి, ఈ సినిమాలో ఎటువంటి మార్పులేదు.

    Kishore Tirumala

    ఇక ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వ్యాపార లావాదేవీలు, నష్టాల పూడిక వంటివి మాత్రం కిషోర్ తిరుమలకి కొంత తలనొప్పే. వాటిని సెట్ రైట్ చేసే పనిలో ఉన్నారు. ఐతే, ఇప్పుడు కిషోర్ తిరుమల మరింత కసిగా రవితేజ సినిమా తీయనున్నారట.

    ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా మిస్ ఫైర్ కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రవితేజ సినిమాతో కిషోర్ తిరుమల మరోసారి సక్సెస్ అయి తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయం అని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

    Also Read:Sarkaru Vaari Paata- Mahesh Gets Teary: అందరిముందే కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ బాబు.. ఏం జరిగింది?

    Recommended Videos:

    Tags