https://oktelugu.com/

Adipurush New Trailer: ‘ఆదిపురుష్’ కొత్త ట్రైలర్ లో భీకర పోరాట సన్నివేశాలు

ట్రైలర్ మొదట విడుదల చేసిన ట్రైలర్ కంటే బాగుంటుందని సమాచారం. మొదటి ట్రైలర్ లో రావణాసురుడిని కేవలం రెండు మూడు షాట్స్ లో మాత్రమే చూపించారు.కానీ ఈ ట్రైలర్ లో రావణాసురిడిని కూడా బాగా చూపించబోతున్నారట. చూడాలి మరి ఈ సరికొత్త ట్రైలర్ ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలను రేపుతుందో అనేది.

Written By:
  • Vicky
  • , Updated On : June 6, 2023 / 07:24 AM IST

    Adipurush New Trailer

    Follow us on

    Adipurush New Trailer: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా రేపు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి లో గ్రాండ్ గా కనీవినీ ఎరుగని రేంజ్ లో చెయ్యబోతున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ 180 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.

    కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వీళ్ళు రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేయబోతున్నారట. ఒక ఈవెంట్ కోసం ఇంత ఖర్చు చెయ్యడం ఇది వరకు ఎప్పుడూ కూడా జరగలేదు. మొట్టమొదటిసారి ఆదిపురుష్ విషయం లోనే అది జరుగుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సినీ ప్రముఖులతో పాటుగా ఆధ్యాత్మిక గురు చిన్నజియ్యర్ స్వామి కూడా ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.

    ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలు ఒక ట్రైలర్ విడుదల చెయ్యగా, వాటికి ఆడియన్స్ నుండి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట.మొదటి ట్రైలర్ లో రామాయణం మొత్తం చూపించిన డైరెక్టర్ ఓం రౌత్, ఇప్పుడు ఈ సరికొత్త ట్రైలర్ రాముడు మరియు రావణుడి మధ్య జరిగే యుద్ధం తాలూకు షాట్స్ ని చూపించబోతున్నారట.

    ఈ ట్రైలర్ మొదట విడుదల చేసిన ట్రైలర్ కంటే బాగుంటుందని సమాచారం. మొదటి ట్రైలర్ లో రావణాసురుడిని కేవలం రెండు మూడు షాట్స్ లో మాత్రమే చూపించారు.కానీ ఈ ట్రైలర్ లో రావణాసురిడిని కూడా బాగా చూపించబోతున్నారట. చూడాలి మరి ఈ సరికొత్త ట్రైలర్ ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలను రేపుతుందో అనేది.