Vijay Varma: నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన జంటలలో ఒకటి తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మ(Vijay Varma) ల జంట. విజయ్ వర్మ అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళు తమన్నా తో ప్రేమాయణం నడపడం వల్ల అందరికీ తెలిసాడు. బాలీవుడ్ లో ఈ జంట ఒక రెండేళ్ల పాటు చేసిన హల్చల్ సాధారణమైనది కాదు. ఏ ప్రైవేట్ పార్టీ లో చూసినా వీళ్లిద్దరి కనిపించేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో వీళ్ళ రొమాన్స్ అప్పట్లో బాలీవుడ్ ని షేక్ చేసింది. చాలా మంది పాలరాతి శిల్పం లాగా ఉండే తమన్నా ఇతన్ని ఎలా ప్రేమించింది, తమన్నా రేంజ్ ఏంటి, ఇతని రేంజ్ ఏంటి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా చేశారు. అలా దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది.
Also Read: ‘కుబేర’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసిందిగా!
తమన్నా తో అలా విడిపోయాడో లేదో, అప్పుడే విజయ్ వర్మ మరో యంగ్ హీరోయిన్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ‘డంగల్’ చిత్రం లో అమీర్ ఖాన్ పెద్ద కూతురు గా నటించిన ఫాతిమా సన షైక్(Fatima Sana Shaikh). నిన్న మొన్నటి వరకు ఈమె అమీర్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపించేవి. ఇప్పుడు ఈమె ఎక్కువగా విజయ్ వర్మ తో కలిసి తిరుగుతుండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పబ్లిక్ గా వీళ్ళు హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి అందరినీ షాక్ కి గురి చేసింది. వీళ్లకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విజయ్ వర్మ లో ఏముందని అందరు అతనికి అలా పడిపోతున్నారు?, పెద్ద పాపులర్ నటుడు కూడా కాదే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇతను మన తెలుగు లో నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన MCA చిత్రం లో మాత్రమే నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. తమన్నా తో రిలేషన్ లో లేనప్పుడు ఇతన్ని మన తెలుగు ఆడియన్స్ MCA విలన్ గా మాత్రమే గుర్తించేవారు,అతని పేరు కూడా తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే తమన్నా తో ప్రేమాయణం నడిపాడో అప్పటి నుండి ఇతని పేరు నేషనల్ వైడ్ గా మారు మోగిపోయింది. ఎక్కడ చూసినా ఇతని గురించే చర్చ. సంవత్సరానికి ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు, మంచి ప్లే బాయ్ లాగా ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో అనుకుంటున్నారు.