fariya abdullah: తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని.. తన నటన, అందంతో మెప్పించిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ అందాల తార.. ఈ సినిమాతో టాలీవుడ్లో అభిమానులను సొంతం చేసుకుంది. అయితే, ఫరియాలో కేవలం నటిమాత్రమే కాదు, మంచి డాన్సర్ కుడా ఉన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ.. డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే అభిమానులను అలరిస్తుంటుంది.

కాగా, జాతిరత్నాలు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వా ఏ సినిమాలకు ఓకే చెప్పలేదు. తాజాగా, ఈ బ్యూటీ నెక్ట్స్ సినిమాపై ఓ ఇంట్రస్టింగ్ అపడేట్ వచ్చింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఢీ అంటే ఢీ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డిసెంబరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే, ఇందులో ఐటెం పాటకు ఫరియా అబ్దుల్లా ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే కింగ్ నాగార్జునతో కూడా ఓ ఐటెం సాంగ్‌లో స్టెప్పులేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం నాగార్జున నటిస్తునన్న బంగార్రాజు సినిమాలో ఫరియా స్పెషల్సాంగ్తో అలరించనుందట. వచ్చే నెలలోనే ఈ పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగచైతన్య హీరోలు కాగా.. కృతిశెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ ఈ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం తండ్రికొడుకులిద్దరూ బంగార్రాజు షూటింగ్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు, నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘోస్ట్’ షూటింగ్ కూడా చేస్తున్నారు. 2022లోనే ఈ సినిమా కూాడా విడుదల కానుంది. ఇక నాగచైతన్య కూడా వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.