Faria Abdullah: ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఫరియా అబ్దుల్లా. 2021లో విడుదలైన జాతి రత్నాలు మూవీతో హైదరాబాద్ భామ ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన జాతిరత్నాలు భారీ విజయం సాధించింది. పెద్ద హీరోల చిత్రాల మాదిరి బాక్సాఫీస్ షేక్ చేసింది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక రోల్స్ చేశారు. జాతి రత్నాలు మూవీలో ఫరియా అమాయకపు లాయర్ పాత్రలో నవ్వులు పూయించింది.
భారీ సక్సెస్ దక్కినా సోలో హీరోయిన్ గా ఆఫర్స్ రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. అఖిల్ పెళ్లి చూపులు చూసే అమ్మాయిలో ఒకరిగా ఫరియా కనిపించింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ మూవీ సూపర్ హిట్ కావడం విశేషం. అలాగే బంగార్రాజు మూవీలో స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.
ఫరియా సోలో హీరోయిన్ నటించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఫరియా లేటెస్ట్ మూవీ రావణాసుర. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీలో ఓ కీలక రోల్ చేసింది. అది కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో ఫరియాకు ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుతం ఓ తమిళ మూవీ చేస్తుంది.
జయాపజయాల సంగతి అటుంచితే ఫరియా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. అబ్బాయిలకు మించి హైట్ ఉండే ఫరియా… మంచి డాన్సర్. తరచుగా తన డాన్స్ టాలెంట్ చూపిస్తూ వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. అలాగే హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఫరియాను ఇంస్టాగ్రామ్ లో ఎనిమిది లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు. తాజాగా ఫరియా మేకప్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలకు నెటిజన్స్ నుండి భారీ రెస్పాన్స్ దక్కింది. మేకప్ లేకున్నా సూపర్ గా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram