
నాగ చైతన్య సినిమాల లైనప్ చాల బలంగా కనిపిస్తోంది. ఎక్కడా గ్యాప్ లేకుండా చైతు వరుసగా సినిమాలను సెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చైతు ఒప్పుకున్న ఒక సినిమా పై బాగా ఆసక్తి క్రియేట్ అవుతుంది. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ‘ఫరా ఖాన్’తో నాగ చైతన్య చేయడానికి అంగీకరించాడు. అయితే, ‘ఫరా ఖాన్’ ఏ బాలీవుడ్ హీరోతోనే సినిమా చేస్తే అది పెద్ద వార్త కాదు కానీ, చైతుతో సినిమా అంటేనే ఇప్పుడు అది హాట్ టాపిక్ అయింది.
‘ఫరా ఖాన్’ ప్రతిభకి మంచి డిమాండ్ ఉంది. దీపిక పదుకొనెని బాలీవుడ్ లో స్టార్ గా మలిచిన దర్శకురాలు ఆమె. ‘ఓం శాంతి ఓం’ వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకురాలు ఆమె. ఇలాంటి దర్శకురాలు చైతూతో సినిమా చేయడం ఏమిటి అంటే ? ఫరా ఖాన్ ఒక కమర్షియల్ యాడ్ ను డైరెక్ట్ చేస్తోంది. ఆ బ్రాండ్ అంబాసిడర్ నాగ చైతన్య. అలా చైతుని డైరెక్ట్ చేసిన ఆమెకు చైతుతో ఒక సినిమా చేయాలనిపించిందట. దాంతో ఇప్పటికే చైతుకి ఒక కథ కూడా చెప్పిందని.. కాకపోతే అది వచ్చే ఏడాది ఎండింగ్ కి గాని సెట్స్ పైకి వెళ్ళదు అని తెలుస్తోంది.
‘ఫరా ఖాన్’ 25 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన ఒక సినిమా పాటకి కొరియోగ్రఫీ అందించింది. అప్పటినుంచి నాగ్ తో ఆమెకు మంచి స్నేహం ఏర్పడింది. అలా ఆ స్నేహం కూడా చైతూతో ఆమె సినిమా చేయడానికి కారణమట. చైతుతో సినిమా గురించి ‘ఫరా ఖాన్’ మాట్లాడుతూ.. ఇప్పుడు ఈ అద్భుతమైన కుర్రాడిని డైరెక్ట్ చేస్తున్నా,” అంటూ ఆమె చెప్పుకొస్తోంది. మొత్తానికి నాగ చైతన్య ఖాతాలో పలు బ్రాండ్స్ ఉన్నాయి. భార్య సమంతతో కలిసి కూడా కొన్ని యాడ్స్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు చైతు ఖాతాలో మరో యాడ్ చేరనుంది.