Comedian Avinash attacked: మరో నాలుగు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో అంగరంగ వైభవం గా చేశారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి తో పాటు, విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొన్నాడు. నిన్న ఆయన అభిమానుల ముందు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతోంది. వెంకీ మామ ఎక్కడుంటే అక్కడ సందడి ఉండాల్సిందే, నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా సుమ నే యాంకరింగ్ చేసింది.
అయితే ఆమెతో పాటు ముక్కు అవినాష్ కూడా కో హోస్ట్ గా వ్యవహరించాడు. ఈమె చంటబ్బాయ్ క్యారెక్టర్ లో, అదే విధంగా అవినాష్ ఆమె అసిస్టెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. నిన్న ఈవెంట్ లో అవినాష్ చేసిన కామెడీ అత్యధిక శాతం మంది నెటిజెన్స్ కి నవ్వు రప్పిస్తే, కొంతమందికి చిరాకు రప్పించింది. ‘మీసాల పిల్ల’ పాట చివర్లో ‘హాల్ లో కాస్త చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా’ అని చిరంజీవి పాడిన బిట్ కి సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో మీమ్స్ వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిన్న అవినాష్ ఈ మేము ని రీ క్రియేట్ చేసాడు. ఈ పాట విడుదలై రెండు నెలలైంది, పాపం చిరంజీవి గారు అంత ప్రేమగా చలిగా ఉంది , దుప్పటి కప్పండి రా అని అడిగితే ఒక్కరు కూడా ఇప్పటి వరకు కప్పలేదు, అందుకే నేను కప్పేస్తా అంటూ చిరంజీవి ముందుకు వెళ్తాడు.
అమ్మగారు నేను ఇక ఆగలేను, చిరంజీవి గారికి దుప్పటి కప్పేస్తా అంటూ ముందుకు వెళ్తున్న సమయం లో అభిమానులు పరిగెత్తుకుంటూ వచ్చి, అవినాష్ పై దుప్పటి కప్పి, పైకి లేపి మూలకు తీసుకొని వెళ్లి ఇరగకుమ్ముతారు. ఇది చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. అయితే అవినాష్ చిరంజీవి స్థాయి వ్యక్తి ముందుకెళ్లి, ఆయన అనుమతి లేకుండా అలా కామెడీ చేయడం ఏంటి?, ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ అయ్యింది, తగ్గించు అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram