chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో ‘కపూర్’ ఫ్యామిలీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో ‘కపూర్’ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. ఐతే, దక్షిణాదిలో తన కుటుంబాన్ని కూడా ‘కపూర్’ ఫ్యామిలీ లాగా చూడాలకున్నానని అన్నారు. ‘హిందీ సినీ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ఎంతో గొప్ప పేరు ఉంది. హిందీ ఇండస్ట్రీ అంటే కపూర్ ఫ్యామిలీ. కపూర్ ఫ్యామిలీ అంటే హిందీ ఇండస్ట్రీ అని చెప్పుకునేవారు. అలాంటి గొప్ప గౌరవం తెలుగులో మెగా ఫ్యామిలీకి దక్కాలన్నది నా కోరిక అంటూ చిరు కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇటు కపూర్ ఫ్యామిలీని అటు మెగా ఫ్యామిలీని కంపేర్ చేస్తూ ఓ అభిమాని పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అభిమాని ఏమి పోస్ట్ చేశాడో చూద్దాం.
Also Read: Telugu Indian Idol: ఇండియన్ ఐడల్: ఒక్కో మెట్టు ఎక్కి ఫైనల్ చేరిన సిరిసిల్ల పేద కుర్రాడి కథ!
కపూర్ ఫ్యామిలీలో హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ఇంకా నిర్మాతలు కూడా ఉన్నారు. అలాగే స్టోరీ, స్క్రీన్ ప్లే, పాటలు, సాహిత్యం లాంటివి రాసే వారు కూడా ఉన్నారు.
ఇటు మెగా ఫామిలీ లో…
1) హీరోలు ఉన్నారు
2) నిర్మాతలు కూడా ఉన్నారు.
3) కాస్ట్యూమ్ డిజైనర్
4) హీరోయిన్ (కొన్ని సినిమాలు చేసిన నిహారిక)
5) కొన్ని ఇతర క్రాఫ్ట్స్ మీద కూడా.. పట్టు వున్నవాళ్లు ఉన్నారు…
6) అల్లు ఫామిలీ స్టూడియో కడుతున్నారు..
7) OTT ప్లాట్ ఫారం ఉంది..

మొత్తానికి అటు కపూర్ ఫ్యామిలీ గురించి, ఇటు మెగా ఫ్యామిలీ ఆ అభిమాని ఇలా మెసేజ్ పెట్టాడు.
‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వస్తున్న ఆచార్య కోసం కొరటాల శివ వరుస ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
Also Read:RRR: 33 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended Videos:
[…] OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు అవతార్. గతంలో వరల్డ్ ఫిల్మ్ రికార్డులని తుడిచిపెట్టిన ఈ చిత్రానికి వరుసగా సీక్వెల్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా అవతార్ 2 ఈ ఏడాది డిసెంబర్ 16న రాబోతోంది. అయితే ఇప్పటివరకు ఫస్ట్‌లుక్ టీజర్లు విడుదల కాలేదు. నేడు లాస్‌వేగాస్‌లో థియేటర్ ఓనర్స్ హాజరయ్యే సినిమాకాన్ వేడుకలో, వారికి ప్రత్యేకంగా అవతార్ 2 టీజర్ వేస్తారని తెలుస్తోంది. […]
[…] Also Read: chiranjeevi: మెగాస్టార్ కామెంట్స్ పై అభిమాన… […]