Director Shafi: ప్రముఖ మలయాళి దర్శకుడు షఫీ (56) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన, కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 16వ తేదీన గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి సీరియస్‌గా మారడంతో మరికొన్ని శస్త్రచికిత్సలు చేసినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మారలేదు. దీంతో షఫీని వెంటిలేటర్ పై ఉంచడం జరిగింది. ఇవాళ ఉదయం 12:25 గంటలకు ఆయన మృతి చెందారు.
షఫీ మలయాళ చిత్రరంగంలో ఎన్నో హిట్ సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. కామెడీ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన షఫీ 50కు పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన “షన్ మ్యాన్ షో” చిత్రంతో మొదలైన ఈ ప్రయాణం “కళ్యాణరామన్”, “పులివెల్ కళ్యాణం”, “తొమ్మనమ్ మక్కలుమ్”, “టూ కంట్రీష్ డిన్ పార్చ్”, “షెరాక్ టోమ్స్” వంటి సినిమాలతో చాలా ప్రాచుర్యం పొందింది.
ఇక 2022లో వచ్చిన “ఆనందం పరమానందం” చిత్రంతో షఫీ చివరి సినిమా రూపొందించారు. ఆయన మరణం మలయాళ సినిమా పరిశ్రమకు భారమైన లోటు. 2001లో దర్శకుడిగా పరిచయమైన షాఫీ, తర్వాత “కళ్యాణ రామన్” చిత్రంతో సూపర్ హిట్ సృష్టించారు.
ఆయన 1968లో ఎన్నాకులంలో జన్మించారు. మొదట మిమిక్రీ, మోనో యాక్టింగ్‌లో మంత్రముగ్దులను చేసిన షాఫీ, తర్వాత సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు పొందారు. షాఫీ మృతికి మలయాళ సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి చెందింది. ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆయన అంతిమదేహం, కలూర్ మనపట్టిపరంబాలోని కోచిన్ సర్వీస్ సహకార హాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అంతిమ సంస్కారాలు ఇవాళ 4 గంటలకు కరుకప్పల్లి జుమా మస్జిద్‌లో జరుగనున్నాయి.షఫీ మృతి పట్ల సిని పరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.