https://oktelugu.com/

Samantha: అక్కినేని ఫ్యామిలీ భరణాన్ని సమంత తిరస్కరించిందా? కారణాలేంటి?

స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత జోడి విడాకుల వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీని సినీ సెలబ్రెటీలు కామెంట్లు చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు. అయితే విడాకుల సమయంలో సమంతకు భారీగా భరణం ఇచ్చారనే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. విడాకులు ఇచ్చినందుకు నాగచైతన్య ఫ్యామిలీ.. సమంతకు ఏకంగా 200 కోట్ల భరణాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ భరణాన్ని సమంత తిరస్కరించిందనే వార్త మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అటు సమంత కానీ.. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2021 / 10:31 AM IST
    Follow us on

    స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత జోడి విడాకుల వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీని సినీ సెలబ్రెటీలు కామెంట్లు చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు. అయితే విడాకుల సమయంలో సమంతకు భారీగా భరణం ఇచ్చారనే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

    విడాకులు ఇచ్చినందుకు నాగచైతన్య ఫ్యామిలీ.. సమంతకు ఏకంగా 200 కోట్ల భరణాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ భరణాన్ని సమంత తిరస్కరించిందనే వార్త మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అటు సమంత కానీ.. ఇటు అక్కినేని ఫ్యామిలీ కానీ పెదవి విప్పలేదు. అక్కినేని ఫ్యామిలీ ఇచ్చే భరణంలో నయాపైసా సమంత తీసుకోకూడదని నిర్ణయించుకుందని..

    ఇప్పటికే దక్షిణాదిలో అగ్రహీరోలు, టాప్ బ్యానర్లతో పనిచేసి సంపాదిస్తోందని.. ఈ భరణాన్ని తిరస్కరించిందని సమాచారం. విడాకులు తీసుకున్నా కానీ..వారి డబ్బు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.

    ఇక విడాకుల తర్వాత బయట కనిపించకూడదని సమంత డిసైడ్ అయ్యారట.. ఈ సంఘటనతో సమంత హృదయం ముక్కలైందని.. ఇప్పట్లో ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకోవద్దనే ఆలోచనల్లో ఉందని సమాచారం. కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కొద్దిరోజులు ఆమెకు మానసిక విశ్రాంతి అవసరం.. ఆ తర్వాతే సినిమాలపై తదుపరి నిర్ణయం తీసుకొంటారని సమంత సన్నిహితులు చెబుతున్నారు.

    ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’ అనే సినిమాలో నటించింది. తమిళంలో ‘కాథువాకులా’లో నటిస్తోంది. ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.