https://oktelugu.com/

F3: దీపావళి శుభాకాంక్షలతో పలకరించిన ఎఫ్​3 చిత్రబృందం!

F3: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​- వరుణ్​ తేజ్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం ఎఫ్​3. తమన్న, మెహ్రిన్​ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు.  కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. సునీల్​ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, దీపావళి కానుకగా ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ తారా జువ్వలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 4, 2021 / 01:03 PM IST
    Follow us on

    F3: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​- వరుణ్​ తేజ్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం ఎఫ్​3. తమన్న, మెహ్రిన్​ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు.  కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. సునీల్​ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

    తాజాగా, దీపావళి కానుకగా ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ తారా జువ్వలు ఎగరేశారు. హైదరాబాద్​లోని దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జ్​ వద్ద సునీల్​, వెంకటేశ్​, వరుణ్​తేజ్​తో సహా దర్శకుడు అనిల్​ రావిపుడి కలిసి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో పాటు తారా జువ్వలు ఎగరేశారు. అలా దుర్గం చెరువు డ్రోన్​ షాట్​తో వీడియో ఎండ్​ అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.

    కాగా, 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్​2.. ప్రేక్షకుల మనసు దోచుకుంది. అందులో కామెడీతో నవ్వులు పూయిస్తూనే.. సెంటిమెంటల్​గా భార్య, భర్తల అనుబంధం గురించి చక్కగా వివరించారు. మరి ఈ సారి ఎలాంటి స్టోరీతో అనిల్​ రావిపుడి థియేటర్లలోకి అడుగుపెట్టనున్నారో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.