Anasuya Bharadwaj: భారీ అందాల బ్యూటీ ‘అనసూయ’ తాజాగా ఖిలాడీ సినిమాలో ‘చంద్రకళ’గా చిందేసింది. మాస్ మహా రాజ్ నటిస్తున్న ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. అయితే, ‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది.

కాగా రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది. మొత్తానికి విచ్చలవిడిగా తన గ్లామర్ ను పరిచి ఫుల్ క్రేజ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలను దక్కించుకుంటూ ముందుగా సాగుతుంది అనసూయ.
Also Read: ‘సమంత – నయనతార’ సినిమాలో ఫేమస్ క్రికెటర్ !
ఏది ఏమైనా యాంకరింగ్ నుండి నటిగా ఎదిగిన అనసూయ ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తోంది. ఖిలాడీలో ఓ సరదా పాత్రలో ‘చంద్రకళ’గా అనసూయ నటించి మెప్పించింది. పైగా ‘చంద్రకళ’గా అనసూయ బాగానే గ్లామర్ ను ఒలకబోసింది.

జబర్థస్త్ యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ‘అనసూయ’ అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా ఎదిగింది. మొత్తానికి అనసూయ.. రవితేజకి అత్తగా కనిపించింది. రవితేజ కంటే అనసూయ వయసులో 20 ఏళ్ళు చిన్నది. అయినా రవితేజ చేత ఆంటి అని పిలిపించుకుంది. అన్నట్టు ఇక నుంచి ఆంటీ పాత్రలు కూడా చేయడానికి తాను రెడీ అని ఒక స్టేట్ మెంట్ కూడా పాస్ చేసింది ఈ భారీ బ్యూటీ.
Also Read: మళ్లీ మొదలైంది మూవీ రివ్యూ..
[…] […]
[…] […]