Game Changer: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్ ఒకప్పుడు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన రెండు మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేసి మరోసారి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఈయన చేసిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా పైన చాలా అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు సరైన అప్డేట్ అయితే రావడం లేదు. ఇక ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు రోజురోజుకీ విసిగిపోతున్నారు. ఇక శంకర్ ను ఉద్దేశించి ‘మాకు నమ్మకం లేదు దొర ‘ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు.
మరి ఇలాంటి సమయంలో ఆయన ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ నైనా వదిలితే ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేసేవారు. కానీ అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్టుగా అభిమానుల ఓపికకు పరీక్ష పెట్టడం అనేది నిజంగా చాలా బ్యాడ్ విషయమనే చెప్పాలి. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు సినిమా మీద నెగిటివ్ అభిప్రాయం పెరిగి పోయే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఆ తర్వాత రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ వచ్చి అలాగే సినిమా ఎలా ఉండబోతుందో దాని మీద ఒక అంచనాకి కూడా వస్తారని వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికైతే శంకర్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.