Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పుడు షో స్టార్ట్ అవుతుంది? ఈసారి ఆట ఎలా ఉండబోతుంది? వంటి విషయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అలాగే 8వ సీజన్లో బిగ్ బాస్ బజ్ ఎవరు హోస్ట్ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గత సీజన్ లో మైండ్ గేమ్ ఆడుతూ టైటిల్ ఫేవరెట్ గా ప్రచారమైన శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలు చేస్తారని, కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటుల్లో శివాజీ ఒకడు. సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ మొదలు పెట్టి హీరో అయ్యాడు. పొలిటికల్ కామెంట్స్ తో తనలోని మరో కోణం చూపించాడు.
అనూహ్యంగా సినిమాలకు దూరమైన శివాజీ బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. షాక్ ఇస్తూ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. హౌస్ లో శివాజీ ప్రవర్తించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పల్లవి ప్రశాంత్, యావర్ లకు అండగా నిలవడం శివాజీకి కలిసొచ్చిన అంశం. ఒక దశలో సీజన్ 7 కి విన్నర్ శివాజీ అని అంతా ఫిక్స్ అయిపోయారు.
ఫ్యామిలీ వీక్ తర్వాత ఈ లెక్కలన్నీ తారుమారయ్యాయి. శోభా శెట్టి పై నెగిటివ్ కామెంట్స్ చేయడం. అమర్ ని కెప్టెన్ కానివ్వకుండా అడ్డుకోవడం శివాజీ కి నెగిటివ్ అయ్యాయి. రేస్ లో వెనుకబడ్డాడు. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్ పుంజుకున్నాడు. పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హౌస్లో పెద్దరికం నడుపుతూ శివాజీ కంటెస్టెంట్స్ ని పలు విషయాల్లో గైడ్ చేసేవాడు. అలాగే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపించాడు.
ఇది ఇలా ఉంటే.. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీని సెలెక్ట్ చేశారట మేకర్స్. బిగ్ బాస్ గేమ్ షోలో నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియ ఎంతో కీలకం. ప్రేక్షకుల అభిప్రాయం ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్స్ ని బయటకు పంపించేస్తారు. అలా ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ చేస్తారు. గత సీజన్ లో గీతూ రాయల్ తన గలాటా ప్రశ్నలతో కంటెస్టెంట్స్ ని ఇరుకున పెట్టింది.
కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం శివాజీని సంప్రదించారట నిర్వాహకులు. కానీ శివాజీ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట. శివాజీ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారట. ఈ కారణంగా డేట్స్ అడ్జెస్ట్ కావడం కష్టం అన్నారట. దాంతో బిగ్ బాస్ బజ్ హోస్టింగ్ చేయడం కుదరదు అని చెప్పేశాడని టాక్ వినిపిస్తుంది. అయితే శివాజీ బంపర్ ఆఫర్ వదులుకున్నాడని అంటున్నారు. ఆయన బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేయడం ద్వారా మరింత పాపులారిటీ దక్కేదని కొందరి వాదన.