Mega Victory Mass Song: సరిగ్గా మరో 15 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu Movie) మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమా మొదలయ్యే ముందు అభిమానుల్లో చాలా అంచనాలు ఉండేవి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కామెడీ జానర్ లో చేస్తున్న చిత్రం, పైగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం, విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో ఇందులో పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ దిశగా ఈ సినిమా అడుగులు మాత్రం వేయడం లేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఏర్పడిన ఆర్గానిక్ హైప్ ఈ సినిమాకు ఏర్పడలేదు. ఇప్పటి వరకు రెండు పాటలు విడుదల చేశారు.
అందులో ‘మీసాల పిల్ల’ పాట పెద్ద హిట్ అయ్యింది, కానీ ‘గోదారి గట్టు మీద రామచిలకవే’ పాట రేంజ్ హిట్ కాదు. ఇక ఈ పాట తర్వాత విడుదలైన రెండవ పాట ‘శశిరేఖ’ అయితే దారుణంగా మిస్ ఫైర్ అయ్యింది. జనాల్లోకి ఈ పాట అసలు వెళ్లలేకపోయింది. ఇక మూడవ పాటగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి డ్యాన్స్ వేసినది విడుదల చేస్తామని అన్నారు మేకర్స్. నిన్న ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు. కాసేపటి క్రితమే ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని కూడా వదిలారు. ఈ ప్రోమో కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఎదో ఇద్దరు హీరోలను ఒక ఫ్రేమ్ లో చూస్తున్నాం అనే ఆనందం తప్ప, మ్యూజిక్ బీట్ లో ఎలాంటి రిథమ్ లేదు. స్టైల్ కూడా నేచురల్ గా అనిపించలేదు. ఒకరి చేతుల్లో నుండి ఒకరు అద్దాలు పెట్టుకోవడం చాలా ఆర్టిఫీషియల్ గా అనిపించింది.
ఈ పాటకు ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసాడు. ఎన్నో డ్యాన్స్ రియాల్టీ షోస్ లో కొరియోగ్రాఫర్ గా చేసి, బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు గుర్తుందా?, ఆరు వారాలు నామినేషన్స్ లోకి రాకుండా, 7 వ వారం నామినేషన్స్ లోకి వచ్చి వెళ్లిపోయిన సందీప్ మాస్టర్ నే ఈ పాటకు కొరియోగ్రఫీ. రీసెంట్ గానే ఈయన శ్రీకాంత్ కొడుకు హీరో గా నటించిన ‘ఛాంపియన్’ మూవీ లో ‘గిర్రా గిర్రా’ పాటకు కొరియోగ్రఫీ చేసాడు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కచ్చితంగా ఈ ‘మెగా విక్టరీ మాస్’ పాటకు కూడా మంచిగా కొరియోగ్రఫీ చేసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.