Hero Ram
Hero Ram : టాలీవుడ్ క్రేజీ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత రెడీ, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రామ్, చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రారంభం నుంచే మంచి హిట్లతో కెరీర్‌ని ప్రారంభించాడు రామ్. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్లు లేక కొంత కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి విజయం సాధించి ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమా డిజాస్టర్ అయ్యాయి. దీంతో మళ్లీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాల విషయంలో కాకుండా ప్రేమ వ్యవహారాల కారణంగా వార్తల్లో నిలిచారు.
రామ్ ఇప్పటికీ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. యాక్షన్, ప్రేమ కథా చిత్రాలకు కూడా తనను సెట్ చేసుకునే రామ్, ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ రూమర్ వ్యాపించింది. రామ్ ప్రస్తుతం ఒక అందాల హీరోయిన్‌తో ప్రేమలో పడిపోయాడని చెబుతున్నారు. ఈ హీరోయిన్ ఎవరంటే రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో అందాలు ఆరబోసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన భాగ్యశ్రీ బోర్సే అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. రామ్, భాగ్యశ్రీ ప్రస్తుతం కలిసి ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సమయంలోనే వారి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారిందని చెబుతున్నారు. అంతే కాకుండా వీరిద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇంతకుముందు, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌తో కూడా రామ్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు భాగ్యశ్రీతో రామ్ ప్రేమలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎంత నిజం ఉన్నది అన్నది మాత్రం రామ్, భాగ్యశ్రీకి మాత్రమే తెలుసు. రామ్ తన కెరీర్‌పై దృష్టి సారిస్తున్నా, అతని వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో తరచూ నిలుస్తూనే ఉన్నారు. రామ్ త్వరగా తన బ్యాచిలర్ లైఫ్‌ను ఎండ్ చేస్తాడా? లేక ఈ రూమర్లకి అడ్డుకట్ట వేసి కెరీర్ ట్రాక్ లోకి వస్తాడా? అని కొందరు వేచి చూస్తున్నారు. రామ్ త్వరగా హిట్ సినిమా చేసి, కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లో పెట్టుకుంటే, ఈ రూమర్లు కూడా ఆగిపోవచ్చని టాలీవుడ్ చర్చించుకుంటోంది.