Homeఎంటర్టైన్మెంట్ప్చ్..'రేణూ దేశాయ్'కి ఇబ్బందికర మెసేజ్ లు.. !

ప్చ్..’రేణూ దేశాయ్’కి ఇబ్బందికర మెసేజ్ లు.. !

Renu Desai

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సమాజ సేవ చేస్తూ అవసరంలో ఉన్న పేదలకు తన వంతుగా సాయం అందిస్తూ కోవిడ్ బాధితుల జీవితాల్లో కొత్త ఆశలను కల్పిస్తున్నారు. అయితే ‘పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు’ అన్న చందంగా మారింది ప్రస్తుత పరిస్థితి.

అసలు సాయం చేసేవారికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవడం చాల దారుణం. మంచి మనసుతో సాయం చేయాలని సంకల్పించిన వారికే కన్నీళ్లు తెప్పించడం బాధాకరమైన విషయం. నిజంగానే రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియా వేదికగా కరోనా పేషెంట్ల కోసం బెడ్లు, ఆక్సిజన్‌, మెడిసిన్స్ వంటివి అందిస్తూ అభాగ్యులకు ఎంతగానో కృషి చేస్తూ ముందకుపోతుంది.

అయితే ఆమె చేస్తున్న సేవ పై ప్రశంసలు కురిపించాల్సింది పోయి, కొంతమంది నెటిజన్లు నెగెటివ్‌ కామెంట్లు చేస్తూ ఏడిపిస్తున్నారు. డబ్బులు ఉన్న వారికే నువ్వు సాయం చేస్తున్నావంటూ రేణును ఉద్దేశించి నిష్టూరంగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా డబ్బు సాయం చేయకపోతే చచ్చిపోతామంటూ ఎమోషనల్ గా బెదరిస్తూ మెసేజ్ లు చేస్తున్నారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

ఇక నుండి తనకీ ఇలాంటి మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రేణు హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా మరోసారి క్లారిటీ ఇస్తూ.. తను ఎవరికీ ఆర్థిక సాయం చేయలేమని స్పష్టం చేసింది. అయితే తానూ కేవలం ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ బెడ్లు, కరోనా రోగులకు ఆహారంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు మాత్రమే సాయంగా అందించగలను, డబ్బు సాయం చేయలేను అని తెలియజేసింది.

మొత్తానికి గత కొన్ని రోజులుగా రేణూ దేశాయ్ ఎంతో మందికి సాయం చేస్తే చివరకు ఆమెకు దక్కుతుంది అపవాదులు అవమానాలు. పాపం గత పది రోజులుగా సాయం చేస్తూనే ఉన్నా.. ఆమెలోని స్పిరిట్ దెబ్బతిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version