https://oktelugu.com/

Eesha Rebba: హోటల్ బెడ్ పై ఈషా రెబ్బా టెంప్టింగ్ లుక్స్… అవకాశాల కోసం అందాలు ఎరవేస్తున్న తెలుగు బ్యూటీ!

Eesha Rebba: గ్లామర్ తో ఎరవేస్తుంది తెలుగు భామ ఈషా రెబ్బా. ఎప్పటికైనా తనలోని హాట్ యాంగిల్ గుర్తించాలని కోరుకుంటుంది. అందుకే హద్దులు దాటేసి అందాల ప్రదర్శన చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా టెంప్టింగ్ ఫోజులతో టెంపరేచర్ పెంచేస్తుంది. ఇంత చేస్తున్నా ఈషా కోరుకున్న ఆఫర్స్, గుర్తింపు రావడం లేదు. సొంతింటి అమ్మాయిని టాలీవుడ్ పట్టించుకోవడం లేదు. శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ఈషా రెబ్బా వెండితెరకు పరిచయం అయ్యారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : September 17, 2022 / 10:28 AM IST
    Follow us on

    Eesha Rebba: గ్లామర్ తో ఎరవేస్తుంది తెలుగు భామ ఈషా రెబ్బా. ఎప్పటికైనా తనలోని హాట్ యాంగిల్ గుర్తించాలని కోరుకుంటుంది. అందుకే హద్దులు దాటేసి అందాల ప్రదర్శన చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా టెంప్టింగ్ ఫోజులతో టెంపరేచర్ పెంచేస్తుంది. ఇంత చేస్తున్నా ఈషా కోరుకున్న ఆఫర్స్, గుర్తింపు రావడం లేదు. సొంతింటి అమ్మాయిని టాలీవుడ్ పట్టించుకోవడం లేదు.

    Eesha Rebba

    శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ఈషా రెబ్బా వెండితెరకు పరిచయం అయ్యారు. సెకండ్ మూవీ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలో సోలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం. వరుసగా అమీ తుమీ. బ్రాండ్ బాబు, దర్శకుడు చిత్రాల్లో ఈషా హీరోయిన్ గా నటించారు. ఇవన్నీ చిన్న చిత్రాలు కావడంతో ఆమెకు పెద్దగా ఫేమ్ రాలేదు.

    Also Read:
    Komatireddy Rajgopal Reddy: రాజగోపాల్‌కు ఎదురుగాలి.. నియోజకవర్గంలో పడిపోయిన గ్రాఫ్‌
    ఇక అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించింది. ఆ సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యత లేని రోల్ చేసిన ఈషా రెబ్బా… ఉన్న ఇమేజ్ కూడా పోగొట్టుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఆమెకు తీరని అన్యాయం. హీరోయిన్ పూజా హెగ్డే చెల్లి పాత్రలో రెండు మూడు సీన్స్ లో మాత్రమే ఈషా కనిపించారు. నిజానికి ఆ సినిమాలో ఈషాను పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అనంతరం సుబ్రమణ్యపురం, రాగల 24 గంటల్లో చిత్రాల్లో మరలా హీరోయిన్ గా నటించారు.

    Eesha Rebba

    ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ ఆమెకు బ్రేక్ ఇచ్చే ఒక్క మూవీ తగల్లేదు. చివరిగా ఈషా కనిపించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ మూవీలో కూడా ఆమెది చిన్న వ్యాంప్ రోల్. హీరోకి పెళ్లి చూపుల్లో తగిలే అమ్మాయి పాత్ర చేసింది. ఎన్నాళ్లు ఎదురుచూసినా పెద్ద సినిమాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు, ఉపయోగపడని చిన్న చిత్రాల్లో హీరోయిన్ ఛాన్సులు దక్కుతున్నాయి. దీంతో ఈషా ఇతర పరిశ్రమలపై కన్నేసింది.

    Also Read: AP Deputy Speaker Kona Raghupathi: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా.. అసలు కారణం ఏంటి..?

    Eesha Rebba

    ఆమె మలయాళంలో ఒట్టు టైటిల్ తో మూవీ చేశారు. ఇది సెప్టెంబర్ 8న విడుదలైంది. అలాగే తమిళంలో ఆయిరం జన్మంగళ్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. టాలీవుడ్ లో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి లాంటి తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. అలాగే ఈషా రెబ్బా కోలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు కొట్టిపారేయలేం. మరి ఈషా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

    Tags