Sreeleela: హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా అవతరించింది. ఏకంగా 8 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఈ యంగ్ బ్యూటీ సంపాదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. కన్నడ అమ్మాయి అయిన శ్రీలీల మెడిసిన్ చదువుతూనే మోడలింగ్ చేసింది. కన్నడ చిత్రంతో హీరోయిన్ అయ్యింది. శ్రీలీలకు డాన్స్ లో కూడా ప్రావీణ్యం ఉంది. బ్యూటీ విత్ టాలెంట్ అన్నట్లు… శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్ కి టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఫిదా అయిపోయారు. ఒకటా రెండా లెక్కకు మించిన ఆఫర్స్ ఇచ్చారు.
పెళ్లి సందడి(2021) చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన శ్రీలీల ధమాకా మూవీతో ఫస్ట్ హిట్ కొట్టింది. అసలు రవితేజ ఎనర్జీకి ఎక్కడా తగ్గకుండా శ్రీలీల డాన్సుల్లో, సన్నివేశాల్లో ఇరగదీసింది. ధమాకా ఆమెకు భారీ ఫేమ్ తెచ్చింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు హీరోల చిత్రాలకు సైన్ చేసింది. వాటిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్స్ కూడా ఉన్నారు. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో శ్రీలీల నటిస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయినట్లు ప్రచారం అవుతుంది. అయితే నితిన్-వెంకీ కుడుముల మూవీ నుండి రష్మిక తప్పుకోవడంతో శ్రీలీలను తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నితిన్ తో రచయిత వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ మూవీలో అధికారికంగా ఎంపికైంది. విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తుంది. బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో కీలక రోల్ చేస్తుంది.
ఆదికేశవ, స్కంద, అనగనగా ఒకరోజు… ఇలా అనేక ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఇక సినిమాకు శ్రీలీల కోటిన్నర నుండి రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. కేవలం ఆరు నెలల వ్యవధిలో శ్రీలీల దాదాపు రూ. 15 కోట్ల వరకు సంపాదించారని సమాచారం. 22 ఏళ్ల శ్రీలీల ఇంత తక్కువ వయసులో ఇది రికార్డు సంపాదన అని చెప్పొచ్చు. టాలీవుడ్ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.