Homeఎంటర్టైన్మెంట్Eagle Collections: బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్న రవితేజ ఈగిల్... రెండు రోజులకు ఎన్ని కోట్లు...

Eagle Collections: బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్న రవితేజ ఈగిల్… రెండు రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Eagle Collections: మాస్ మహరాజ్ రవితేజ ఈగల్ అంటూ థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈగల్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆడియన్స్ లో కొందరు సినిమా బాగుందని అంటున్నారు. మరికొందరు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే వాదన వినిపిస్తున్నారు. ఈగల్ మూవీ వసూళ్లు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

మిక్స్డ్ టాక్ మధ్య ఈగల్ మొదటిరోజు వరల్డ్ వైడ్ రూ. 11.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ. 5.8 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు వసూళ్లలో డ్రాప్ కనిపించింది. అయితే భారీ డ్రాప్ అని చెప్పలేం. ఈగల్ సెకండ్ డే రూ. 7 కోట్ల గ్రాస్, రూ. 4 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండు రోజులకు వరల్డ్ వైడ్ రూ. 18.9 కోట్ల గ్రాస్, రూ. 9.8 కోట్ల షేర్ రాబట్టింది.

ఈగల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరో రూ. 12 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తే కానీ మూవీ బ్రేక్ ఈవెన్ చేరుకోదు. ఆదివారం ఈగల్ చిత్రానికి కీలకం కానుంది. రెండో రోజుకు మించిన స్పందన ఆదివారం కనిపిస్తుంది. వీకెండ్ ఈగల్ మూవీ గ్రాండ్ గా ముగించిన నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవుతుంది. సోమవారం నుండి వసూళ్లు బాగా తగ్గిపోయే అవకాశం కలదు.

ఈగల్ మూవీలో రవితేజ డిఫరెంట్ రోల్ చేశారు. ఆయన పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ కీలక రోల్ చేసింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ఆమె అలరించారు. కావ్య థాపర్ మరొక హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరోయిన్ మధుబాల, నవదీప్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. ఈగల్ మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేదు. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ధమాకా తర్వాత రవితేజకు హిట్ లేదు.

RELATED ARTICLES

Most Popular