https://oktelugu.com/

Dunki Twitter Talk: డంకీ మూవీ ట్విట్టర్ టాక్: షారుఖ్ ఖాన్ కి హ్యాట్రిక్ హిట్, సినిమాలో అసలు ట్విస్ట్ అదే!

ఇంత వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న హిరాణీ డంకీ మూవీతో ఆ ట్రాక్ కంటిన్యూ చేశారా?. డిసెంబర్ 21న డంకీ చిత్రం వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 21, 2023 / 09:25 AM IST

    Dunki Twitter Talk

    Follow us on

    Dunki Twitter Talk: పఠాన్, జవాన్ చిత్రాల విజయాలతో జోరు మీదున్నారు షారుఖ్ ఖాన్. ఒకే ఏడాది ఆయన మూడు చిత్రాలు విడుదల చేశారు. ఆల్రెడీ రెండు ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశాడు. షారుఖ్ నుండి వస్తున్న మూడో చిత్రం డంకీ. పఠాన్, జవాన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కాయి. డంకీ ఆ రెండు చిత్రాలకు భిన్నమైన సినిమా. దర్శకుడు రాజ్ కుమార్ హిరణీ మార్క్ చిత్రం. ఎమోషన్, కామెడీ కలగలిపి సామాజిక సందేశం ఇవ్వడం రాజ్ కుమార్ హిరాణీ స్టైల్. డంకీ చిత్రం కూడా అలాంటిదే.

    ఇంత వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న హిరాణీ డంకీ మూవీతో ఆ ట్రాక్ కంటిన్యూ చేశారా?. డిసెంబర్ 21న డంకీ చిత్రం వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి. టాక్ బయటకు వచ్చింది. డంకీ చిత్ర కథ విషయానికి వస్తే… మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఐదుగురు పల్లెటూరి వ్యక్తులు లండన్ వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటారు. వాళ్లకు ఇంగ్లీష్ రాదు. డబ్బులు లేవు.

    ఎలాగైనా లండన్ వెళ్లాలని ప్రయత్నం చేస్తారు. వారి ప్రయత్నాలు సక్సెస్ కావు. విసిగిపోయిన ఐదుగురు మిత్రులు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటారు. అక్రమంగా లండన్ లో అడుగుపెట్టాలి అనుకుంటారు. లండన్ బోర్డర్ దాటాలని ప్రయాణం మొదలుపెడతారు. మరి ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? వాళ్ళ ప్రయత్నం ఫలించిందా? అసలు ఎందుకు లండన్ వెళ్లాలి అనుకుంటున్నారు? అనేదే కథ…

    సోషల్ మీడియాలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. రాజ్ కుమార్ హిరాణీ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోవడంలో మరోసారి సక్సెస్ అయ్యాడని అంటున్నారు. ఎమోషన్, హ్యూమర్, సస్పెన్సు తో ఆసక్తికరంగా కథను నడిపించాడని అంటున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో డంకీ మెప్పించిందని ట్విట్టర్. షారుఖ్ ఖాన్ నటన అద్భుతంగా ఉంది. ఆయన డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ నటన సినిమాకు ప్లస్ అంటున్నారు. డంకీ చిత్రంతో షారుఖ్ ఖాన్ మరో బ్లాక్ బస్టర్ కొట్టాడని అంటున్నారు…