Dunki Collections: అనుకున్నట్లే అయ్యింది. ప్రభాస్ మాస్ మూవీ దెబ్బకు షారుఖ్ ఖాన్ క్లాస్ మూవీ కుదేలయింది. రెండో రోజు డంకీ వసూళ్లు తగ్గాయి. సలార్-డంకీ బాక్సాఫీస్ వార్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రెండు చిత్రాలపై అంచనాలు ఉన్నాయి. డంకీ అపజయం ఎరుగని రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన చిత్రం. మరోవైపు సలార్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. రెండూ భిన్నమైన జోనర్స్ కి చెందినవి. డంకీ ఎమోషనల్ కామెడీ డ్రామా, సలార్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
ఫస్ట్ డే సలార్ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. అదే సమయంలో డంకీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాబట్టలేకపోయింది. ఫస్ట్ డే డంకీ కేవలం… ఇండియా వైడ్ రూ. 30 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాదికి ఇది షారుఖ్ ఖాన్ లోయస్ట్ ఓపెనింగ్. పఠాన్ , జవాన్ ఓపెనింగ్స్ కి డంకీ దరిదాపుల్లో కూడా లేదు. సెకండ్ డంకీ చిత్రానికి రెస్పాన్స్ ఇంకా తగ్గింది. సెకండ్ డే రూ. 20 కోట్లు మాత్రమే రాబట్టింది.
క్లాస్ సినిమాలు ఇష్టపడే ఓవర్సీస్ ఆడియన్స్ కూడా పెద్దగా డంకీ చిత్రంపై ఆసక్తి చూపలేదు. ఓవర్సీస్ లో డంకీ $3.2 మిలియన్ వసూళ్లు రాబట్టింది. అంటే రూ. 26 కోట్లు రాబట్టింది. ఇక రెండు రోజులకు ఇండియా వైడ్ డంకీ రూ.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మరో రెండు రోజులు వీకెండ్ ఉంది. శని, ఆదివారాల్లో డంకీ పుంజుకోవాల్సి ఉంది. సలార్ నుండి డంకీ చిత్రానికి గట్టి పోటీ ఎదురవుతుంది.
డంకీ కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా ఒక సామాజిక అంశం టచ్ చేస్తూ తెరకెక్కింది. లండన్ వెళ్లాలని కలలు కనే మిడిల్ క్లాస్ యూత్ కథ ఇది. లండన్ వెళ్లేందుకు ఆంగ్లం నేర్చుకుని, అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నం చేసి విఫలం అవుతారు. అప్పుడు అక్రమంగా లండన్ వెళ్లాలని ప్లాన్ వేస్తారు. ఈ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందుల సమాహారమే డంకీ చిత్రం. విక్కీ కౌశల్, తాప్సి పన్ను ఇతర కీలక రోల్స్ చేశారు.