Homeఎంటర్టైన్మెంట్RCB Bowler Duffy Performance IPL 2026: ఎవరితడు..ఎంట్రీలోనే మూడు వికెట్లు.. బెంగళూరుకు హెజిల్ వుడ్...

RCB Bowler Duffy Performance IPL 2026: ఎవరితడు..ఎంట్రీలోనే మూడు వికెట్లు.. బెంగళూరుకు హెజిల్ వుడ్ ఇక అవసరం లేదు

RCB Bowler Duffy Performance IPL 2026: గత ఐపీఎల్ సీజన్లో బెంగళూరు సాధించిన విజయాలలో హెజిల్ వుడ్ ముఖ్య పాత్ర పోషించాడు. బ్యాటర్లు విఫలమైన చోట.. అతడు తన బంతి ద్వారా అద్భుతాలను సృష్టించాడు. వికెట్ల వికెట్లు తీసి బెంగళూరు జట్టుకు మర్చిపోలేని విజయాలను అందించాడు. హెజిల్ వుడ్ గాయపడిన నేపథ్యంలో.. కొంతకాలంగా అతడు మైదానానికి దూరంగా ఉంటున్నాడు. చివరికి ఆస్ట్రేలియా ఆడిన మేజర్ టోర్నీలకు కూడా అతడు దూరమయ్యాడు.

Also Read: మనిషా.. పక్షా.. ఇలా జరిగిందేంటి?.. షాక్ లో ఇషాన్ కిషన్

హెజిల్ వుడ్ ఐపీఎల్ నాటికి కోలుకుంటాడని.. జట్టుకు అందుబాటులోకి వస్తాడని బెంగళూరు భావించింది. కానీ.. ఇంకా అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని అందుకోలేకపోయాడు. దీంతో అతడు లేని లోటు ఎవరు పూడుస్తారని మేనేజ్మెంట్ ఆలోచించింది. బెంగళూరు శిక్షకులలో ఒకరైన దినేష్ కార్తీక్ సూచన మేరకు డఫీకి అవకాశం ఇచ్చింది. ప్రాక్టీస్ లో అతడు ఉత్సాహంగా పాల్గొన్నాడు. బెంగళూరు పిచ్ మీద బంతిని అద్భుతంగా మెలి తిప్పాడు. దీంతో మేనేజ్మెంట్ కు అతని మీద నమ్మకం కుదిరింది. భువనేశ్వర్ కుమార్ కు అండగా ఉంటే చాలు అని మేనేజ్మెంట్ భావించింది.

శనివారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో డఫీ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ప్రమాదకరమైన హెడ్.. అభిషేక్ శర్మ.. నితీష్ కుమార్ రెడ్డి వికెట్లను పడగొట్టాడు. ముఖ్యంగా ఒకే ఓవర్ లో అభిషేక్.. హెడ్ వికెట్లు తీసి డఫీ సంచలనం సృష్టించాడు. డఫీ పొదుపుగా బౌలింగ్ వేయడం.. వికెట్లను కూడా తీయడంతో బెంగళూరు జట్టుకు తిరుగులేకుండా పోయింది.. డఫీ వికెట్లు తీసిన తర్వాత.. స్ట్రాటజిక్ టైం అవుట్ లో దినేష్ కార్తీక్ ను ఇదే విషయం గురించి ప్రస్తావించగా.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

“డఫీ నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. ముఖ్యంగా పిచ్ స్వభావాన్ని అతడు వేగంగా అర్థం చేసుకుంటాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో బౌలింగ్ చేశాడు. వైవిద్యంగా ఉండే బెంగళూరు పిచ్ మీద 3 వికెట్లు తీయడం మామూలు విషయం కాదు. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించి చూపించాడు అని” దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. డఫీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న నేపథ్యంలో.. హెజిల్ వుడ్ లేని లోటు బెంగళూరుకు తీరిపోయిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై హెజిల్ వుడ్ రాకపోయినా పర్వాలేదని.. అతడు మ్యాచులు ఆడకపోయినా ఇబ్బంది లేదని అభిమానులు భావిస్తున్నారు.. మూడు వికెట్లు తీయడంతో.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో డఫీ మెన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular