Dude Movie Box Office Collection: ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా దీపావళి కి వరుసగా కొత్త సినిమాలు విడుదలయ్యాయి. నేడు యూత్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న తెలుసు కదా(Telusu Kada Movie), డ్యూడ్(Dude Movie) చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిల్లో డ్యూడ్ చిత్రానికి పర్వాలేదు, బాగుంది అనే రేంజ్ టాక్ రాగా, తెలుసు కదా చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ రెండు సినిమాల్లో మొదటి నుండి డ్యూడ్ కి అటు తమిళ ఆడియన్స్ లో, ఇటు తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో ఓపెనింగ్స్ దుమ్ము లేపేసింది. కానీ ‘తెలుసు కదా’ చిత్రానికి మాత్రం డిజాస్టర్ ఓపెనింగ్స్ దక్కాయి. దీపావళి పండుగ వరకు కూడా ఈ సినిమా థియేటర్స్ లో నిలబడేలాగా కనిపించడం లేదు. అంత దారుణంగా ఉన్నాయి ఓపెనింగ్స్. రెండు సినిమాలకు ఓపెనింగ్స్ విషయం లో ఎంత తేడా ఉందో ఒక ఉదాహరణ మీ ముందు ఉంచబోతున్నాము.
బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో ‘డ్యూడ్’ సినిమాకు గంటకి పది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మరోపక్క ‘తెలుసు కదా’ చిత్రానికి గంటకు వెయ్యి టికెట్స్ మాత్రమే అమ్ముడుపోతున్నాయి. అంటే దాదాపుగా పది రెట్లు ఎక్కువ అన్నమాట. ఈ రేంజ్ డామినేషన్ ఈమధ్య కాలం లో ఎప్పుడూ చూడలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే డ్యూడ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రెండు భాషలకు కలిపి పాతిక కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ బాగుంటే మరో 30 కోట్ల గ్రాస్ వరకు వెళ్లొచ్చు. మరోపక్క ‘తెలుసు కదా’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
సిద్దు జొన్నలగడ్డ మరియు ప్రదీప్ రంగనాథన్ ఇద్దరూ ఒకే జనరేషన్ కి సంబంధించిన హీరోలు. ప్రదీప్ కి వరుసగా లవ్ టుడే, డ్రాగన్ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. రెండు సినిమాలకు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక సిద్దు విషయానికి వస్తే టిల్లు సిరీస్ తో ఎంతటి సెన్సేషన్ సృష్టించాడో మన అందరం చూసాము. అయితే ప్రధీప్ కి వచ్చినంత క్రేజ్, సిద్దు కి ఎందుకు రాలేదు?, ఒక తమిళ సినిమా, మన తెలుగు యంగ్ హీరో సినిమాని ఈ రేంజ్ లో డామినేషన్ చేయడం ఏంటి?, తప్పు ఎక్కడ జరుగుతోంది?,కనిపెట్టకపోతే కెరీర్ లో ఇంకా గట్టి ఎదురు దెబ్బలను ఎదురుకోవాల్సి వస్తుంది. సిద్దు మంచి టాలెంట్ ఉన్న హీరో, కాస్త స్క్రిప్ట్ సెలెక్షన్స్ మీద ఫోకస్ పెడితే వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.