Drishyam 3 Opening Day Collections: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరో గా నటించిన ‘దృశ్యం 3’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం పై ఉన్నటువంటి అంచనాలు సాధారమైనవి కాదు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంతటి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడం గమనార్హం. సినిమా చాలా సాదాసీదాగా ఉందని, క్లైమాక్స్ తప్ప పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదని , మొదటి రెండు భాగాలతో పోలిస్తే చాలా యావరేజ్ సినిమా అని , అసలు ‘దృశ్యం 2’ తో ముగించి ఉండుంటే బాగుండేదని , ‘దృశ్యం 3’ అవసరం లేదని అంటున్నారు.
టాక్ డివైడ్ గానే వచ్చినప్పటికీ , కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపేస్తోంది. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 40 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక మలయాళం సినిమాకు ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం వంటివి గతం లో ఎప్పుడూ జరగలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 40 కోట్ల రూపాయలకు పైగా ఉండగా , ఈ కరెంటు బుకింగ్స్ ద్వారా మరో 30 నుండి 40 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు. తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఓపెనింగ్స్ ఇక్కడ కూడా గట్టిగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ ఓపెనింగ్ దక్కింది , మరి లాంగ్ రన్ ఎలా ఉంటుందో, డివైడ్ టాక్ ప్రభావం ఈ సినిమా పై ఎంత పడుతుందో చూడాలి.
