Dragon Movie Latest Updates: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘దేవర’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. అప్పటివరకు ఆయన కెరియర్ లోనే అలాంటి సినిమా చేయలేదు. మొత్తానికైతే ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుంది అనుకున్నారు. కానీ 600 కోట్ల వరకే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఇంతేనా బాక్సాఫీస్ వద్ద ఆయన పెద్దగా మ్యాజిక్ చేయలేడా అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు… ఇక ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడు అని అందరు అనుకున్నప్పటికి ఆ సినిమా పూర్తిగా డీలే అయిపోయింది.
డిజాస్టర్ ను మూటగట్టుకోవడంతో ఆయన ఎలాగైనా సరే భారీవిజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. మొత్తానికైతే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఒక్కటే తన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు…
ఇక ప్రశాంత్ నీల్ సైతం బడ్జెట్ కి వెనకాడకుండా భారీ సెట్ల ను వేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బడ్జెట్ తో సంబంధం లేకుండా సినిమా సక్సెస్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సలార్ సినిమాలో ఎలాగైతే ఎలివేషన్స్ ను వాడుకొని భారీగా సక్సెస్ ని సాధించాడో ఈ సినిమాలో సైతం అలాంటి స్ట్రాటజీ ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. సినిమా గ్లింప్స్ లో పరిచయం చేసినట్టుగానే ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమాగా కూడా తెలుస్తుంది. ఇంతవరకు ఎన్టీఆర్ దేశభక్తి కి సంబంధించిన సినిమా చేయలేదు. కాబట్టి తన నుంచి వస్తున్న ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని ఇందులో కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నారు అంటూ ప్రశాంత్ నీల్ సైతం చెబుతుండడం విశేషం…
