Dragon: ఇటీవలే విడుదలైన ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించి, ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసింది. తెలుగు లో ఈ సినిమాకి కేవలం నాలుగు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే 17 రోజులకు కలిపి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే ఆరు కోట్ల రూపాయిల లాభాలు అన్నమాట. పెట్టిన డబ్బులకు మూడింతలు లాభాలు ఈ ఏడాది ఈ సినిమాకే తెలుగు, తమిళ భాషల్లో జరిగింది. తమిళనాడు లో ఇప్పటి వరకు ఈ సినిమాకి 73 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీ లో డబ్ చేసి విడుదల చేయబోతున్నాడు మేకర్స్. మార్చ్ 14వ తారీఖున హోలీ సందర్భంగా ఈ సినిమా హిందీ లో విడుదల కాబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది మూవీ టీం. ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించిన మొదటి చిత్రం ‘లవ్ టుడే’ ని హిందీ లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్(Junaid Khan) రీమేక్ చేసాడు. శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్(Kushi Kapoor) ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ప్రదీప్ రంగనాథన్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అక్కడ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. నిర్మాతగా ప్రదీప్ కి నష్టాలను కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రం.
బాలీవుడ్ లో నిర్మాతగా ఫెయిల్యూర్ ని ని ఎదురుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కి, ‘డ్రాగన్’ చిత్రం సక్సెస్ ని ఇస్తుందా?, ప్రొమోషన్స్ పర్ఫెక్ట్ గా చేస్తే కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. కానీ మేకర్స్ ప్రొమోషన్స్ విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి, ప్రొమోషన్స్ అవసరం లేకుండానే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. హిందీ లో ఒక సినిమా ని ఆడియన్స్ ఆదరించడం అంత తేలికైన విషయం కాదు. కానీ ఒక్కసారి వాళ్ళు ఆదరించడం మొదలు పెడితే కలెక్షన్స్ ఎక్కడ మొదలై, ఎక్కడ ఆగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఆ రేంజ్ ర్యాంపేజ్ ఉంటుంది. రీసెంట్ గా విడుదలైన అన్ని పాన్ ఇండియన్ సినిమాలు అందుకు ఉదాహరణ. ‘పుష్ప’ ప్రస్థానం కూడా అలాగే మొదలైంది. ఈరోజు ఆ సినిమా సీక్వెల్ కి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.