Dragon Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(Dragon Movie). ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. గత నెల 22వ తారీఖు నుండి జూనియర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యి 15 రోజుల భారీ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజున ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆయన పుట్టిన రోజు మే 20 అనే సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వారం లోనే ఆ అప్డేట్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : మంచు లక్ష్మి పై ఫైర్ అయిన రోజా..షో నుండి వాకౌట్..వీడియో వైరల్!
ఇకపోతే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఇప్పటికే కన్నడ బ్యూటీ రుక్మిణీ వాసంత్(Rukmini Vasanth) ని ఎంచుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కథకు ఎంతో ముఖ్యమైన మరో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ యూత్ ఆడియన్స్ ఈమె అంటే ఏ రేంజ్ లో వెర్రిక్కిపోతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత ఏడాది ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘స్త్రీ 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఆమె రేంజ్ ఏమిటి అనేది. ఈమెని టాలీవుడ్ కి తీసుకొచ్చేందుకు చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇంతకు ముందు ఆమె టాలీవుడ్ లో ప్రభాస్ తో కలిసి ‘సాహూ’ చిత్రం చేసింది.
అప్పటికి శ్రద్ధా కపూర్ కి క్రేజ్ అయితే బాగానే ఉండేది కానీ, ఇప్పుడు ఉన్నంత క్రేజ్ మాత్రం ఉండేది కాదు. పైగా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ శ్రద్ద కపూర్ వైపు మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు చూడలేదు. కానీ ఇప్పుడు ఈమెకు స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్, మార్కెట్ ఉంది. కానీ ఈమె డేట్స్ దొరకడం అంత తేలికైన విషయం కాదు. అంతే కాకుండా రెమ్యూనరేషన్ కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో డిమాండ్ చేస్తూ ఉంది. పుష్ప 2 లో కిస్సిక్ పాటని ముందుగా ఈమెతోనే చేయించాలని అనుకున్నారు. కానీ 8 కోట్లు డిమాండ్ చేయడం తో సుకుమార్ వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రం నటించడానికి ఆమె ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. మేకర్స్ కూడా అందుకు ఒప్పుకున్నారట. సినిమాలో ఈమె సెకండ్ హాఫ్ లో వస్తుందని తెలుస్తుంది.