Dragon movie glimpse analysis: నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా , నిన్న రాత్రి మేకర్స్ ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి సోషల్ మీడియా అంతటా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ పై ట్రోల్స్ అయితే గట్టిగానే పడ్డాయి కానీ , ప్రశాంత్ నీల్ టేకింగ్, స్టోరీ బిల్డింగ్ కి మాత్రం సెల్యూట్ చేశారు నెటిజెన్స్. ఒక కమర్షియల్ సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్స్ తో, ఎవ్వరూ ఆలోచన చెయ్యని విధంగా , ఇలా కూడా చెప్పొచ్చా అని తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేస్తుంటాడు ప్రశాంత్ నీల్. ‘డ్రాగన్’ తో కూడా ఆయన అదే చేశాడు. బ్రిటీషర్స్ మన వద్ద సంపద దోచుకోవడానికి వచ్చారని, దోచుకున్న తర్వాత వాళ్ళు 250 ఏళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్లకపోవడానికి కారణం ఓపియం అనే మొక్క అని, అది ఆఫ్గనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రైయాంగిల్ లో ఎక్కువగా పెరుగుతుంది.
ఈ ఓపియం మొక్క ద్వారానే మాదకద్రవ్యాలను తయారు చేస్తారని, బ్రిటిషర్లు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఈ మొక్క కోసం రెండు కంపెనీలు యుద్ధం చేసుకున్నాయని , ఒక కంపెనీ పేరు ‘ఆఫ్గనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ’ కాగా , మరో కంపెనీ పేరు ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’ అని ప్రశాంత్ నీల్ ఈ గ్లింప్స్ లో న్యారేట్ చేశాడు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ కి కింగ్ గా ‘లూగర్’ కొనసాగుతుండగా, ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’ కి కింగ్ గా డ్రాగన్ కొనసాగుతాడని అంటున్నారు. లూగర్ విలన్ , డ్రాగన్ హీరో , వీళ్లిద్దరి మధ్య జరిగే సంగ్రామమే ఈ సినిమా. నిన్న విడుదల చేసింది విలన్ కి సంబంధించిన గ్లింప్స్ , త్వరలోనే హీరో కి సంబంధించిన గ్లింప్స్ ని కూడా విడుదల చేస్తారట.
ఈ రెండు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లింప్స్ ని చూసి సినిమా ని అంచనా వేయడం ఎంత తప్పో, గ్లింప్స్ లో ఎన్టీఆర్ లుక్స్ ని చూసి ఆయన్ని తక్కువ చేసి చూడడం కూడా అంతే తప్పు , ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ ఏంటో , ఆయన డైలాగ్ డెలివరీ ఏంటో దేశం మొత్తం ఇప్పటికే చూసింది. నటన కి , టాలెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్టీఆర్. కాబట్టి తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో , ఎన్టీఆర్ రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించి, బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తాడని అంటున్నారు విశ్లేషకులు.
