1 Nenokkadine Movie: సినిమాల్లో కనిపించేవి మరియు వినపడేవి అన్నీ నిజం కాదనే విషయం మన అందరికీ తెలిసిందే. హీరోలు చేసే రిస్కీ షాట్స్ దాదాపుగా 90 శాతం వరకు ధూప్స్ ని ఉపయోగిస్తుంటారు డైరెక్టర్స్. అయితే టాలీవుడ్ లో అప్పుడప్పుడు అయినా రిస్కీ షాట్స్ చేసే ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రిలాగానే ఈయన కూడా డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అనే విషయం అందరికీ తెలిసిందే.
సినిమాల్లో సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత కూడా ప్రయోగాలు చెయ్యాలన్నా,రిస్కీ షాట్స్ చెయ్యాలన్నా మహేష్ బాబు కి ఎంతో ఇష్టం. ఆయన హీరో గా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో కూడా ఎన్నో రిస్కీ స్తంట్స్ చేసాడు సూపర్ స్టార్ మహేష్. ఆ సినిమాలో అన్ని రిస్కీ స్తంట్స్ చేసిన ఆయన, చాలా సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పలేదు అనే విషయం ఎవరికైనా తెలుసా..?
కొన్ని కారణాల చేత మహేష్ బాబు ఈ చిత్రం లోని కొన్ని కీలక సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పలేదు.ఆ సమయం లో డైరెక్టర్ సుకుమార్ జబర్దస్త్ లో పాపులర్ కమెడియన్ గా కొనసాగుతున్న ‘బుల్లెట్ భాస్కర్’ ని పిలిపించి చెప్పించాడట. ఈయన మహేష్ బాబు వాయిస్ ని ఇమిటేట్ చెయ్యడం లో నిష్ణాతుడు.ఇతను మహేష్ బాబు గొంతుని మిమిక్రీ చేస్తే అసలు మహేష్ వాయిస్ కాదు, ఇది మిమిక్రి అంటే ఎవ్వరూ నమ్మరు. మహేష్ బాబు కూడా ఇతని మిమిక్రి విని ఆశ్చర్యపోయాడట.అయితే ఇప్పటి వరకు ఆయన మహేష్ ని ప్రత్యేకంగా కలిసి మాట్లాడే అవకాశం రాలేదట.
ఒక్కసారి ఫోటోషూట్ ని నిర్వహించినప్పుడు ఆయనతో కలిసి ఫోటో దిగాడు కానీ, ప్రత్యేక ఇంటరాక్షన్ మాత్రం ఎప్పుడూ జరగలేదట. రీసెంట్ గా ఆయనని కలిసే ఛాన్స్ వచ్చింది కానీ, అదే రోజు వేరే షూటింగ్ లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉండగా మహేష్ ని కలవలేకపోయారట. బుల్లెట్ భాస్కర్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.