Anil Ravipudi goal: రొటీన్ రెగ్యూలర్ కథలతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించడం అనేది అంత ఆశామాశీ వ్యవహారమైతే కాదు. అందులో ఎంతో కొంత వైవిధ్యం లేనిది ప్రేక్షకులు ఆ సినిమాని చూడరు. కానీ అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు మాత్రం రొటీన్ కథను తీసుకొని దానికి కొత్తగా ట్రీట్ మెంట్ రాసుకొని మొత్తానికైతే ఆ సినిమాని సక్సెస్ ఫుట్ గా నిలుపుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో వరుసగా ట్రిబుల్ హ్యాట్రిక్ విజయాలను సాధించిన దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అలాంటి దర్శకుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సక్సెస్ ఫుల్ దర్శకుల లిస్టులో ఒకరిగా చేరిపోయాడు. కాబట్టి అనిల్ రావిపూడి ముందు ఇప్పుడు ఒక్కటే లక్ష్యం ఉంది. ఇప్పటివరకు సీనియర్ హీరోలందరితో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన ఈ తరం దర్శకుడెవరు లేరు. కాబట్టి ఆయన ఆ ఘనత సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలయ్య లకు సక్సెస్ లను అందించాడు. ఇప్పుడు నాగార్జునకి సక్సెస్ ని అందిస్తే సీనియర్ హీరోలందరికి సక్సెస్ ని సాధించి పెట్టిన ఏకైక దర్శకుడిగా గొప్ప గుర్తింపు సంపాదించుకుంటాడు…
అలాగే ఎవ్వరికి దక్కని ఒక రికార్డు ను కూడా క్రియేట్ చేసినవాడవుతాడు. ఆయన ఏ హీరోతో చేసిన ఆ హీరో మేనరిజమ్స్ ను పట్టుకొని, ఆ హీరో పాత సినిమాల్లోని వింటేజ్ లుక్స్ ని చూపించి ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేసి సక్సెస్ ని సాధిస్తుంటాడు. ఇక ప్రస్తుతం నాగార్జున బిజీగా ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు వెంకటేష్ తో మరో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వెంకటేష్ తో మూడు సినిమాలను చేసిన ఆయన రీసెంట్ గా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌కి సినిమాలో సైతం వెంకటేష్ తో ఒక క్యామియో రోల్ చేయించాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
మొత్తానికైతే వెంకటేష్ కామెడీ టైమింగ్ కి అనిల్ రాసే కామెడీ పంచులకు చాలా బాగా సెట్ అవుతుంది… అంటూ తమ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. 2027 సంక్రాంతికి సైతం అనిల్ రావిపూడి తన హవాని కొనసాగించబోతున్నాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…