Why Nagarjuna is not leaving Bigg Boss Show
Nagarjuna: బిగ్ బాస్ షోపై అత్యంత వ్యతిరేకత ఉంది. సంప్రదాయవాదులు ఈ షోని తీవ్రంగా ఖండిస్తున్నారు. బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హోస్ట్ నాగార్జునకు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయినా నాగార్జున బిగ్ బాస్ వదల్లేదు. దానికి కారణం ఏమిటో ఓ కంటెస్టెంట్ బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు షకీలా. నటి షకీలా అప్పట్లో శృంగార తారగా ఓ వెలుగు వెలిగింది. షకీలా సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ధియేటర్స్ లో సందడి మామూలుగా ఉండేది కాదు. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ ఆమెకు ఉండేది. మలయాళంలో ఆమె లేడీ సూపర్ స్టార్. ఆమె నటించిన మలయాళ చిత్రాలు తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా డబ్ అయ్యేవి. షకీలా సినిమా విడుదల అవుతుంది అంటే అగ్ర హీరోలు సైతం తమ రిలీజ్లు వాయిదా వేసుకునే వారు.
స్టార్ హీరోలకు మించి షకీలా సినిమాలు బంపర్ హిట్లు సాధించేవి. అయితే మెల్లగా ఆమె ఫేమ్ తగ్గుతూ వచ్చింది. కమెడియన్, క్యారెక్టర్ రోల్స్ కి పడిపోయింది. కెరీర్ లో హైట్స్ చూసిన షకీలా… పర్సనల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు పడింది. సినిమా అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. కాగా గత ఏడాది షకీలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసింది.
హౌస్ లో ఉంది తక్కువ రోజులే అయినప్పటికీ ఒక పాజిటివ్ ఇమేజ్ తో బయటికి వచ్చింది. హౌస్ లో ఉన్నప్పుడు నిజాయితీగా గేమ్ ఆడటానికి ప్రయత్నించారు. రెండు వారాలకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా సంచనల వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో వల్ల హోస్ట్ నాగార్జున తప్ప ఎవరికీ ప్రయోజనం లేదని ఆమె అన్నారు.
బిగ్ బాస్ ద్వారా ఎంతమంది సెలెబ్రెటీలకు ఫేమ్ వచ్చింది. ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు అనే అంశాలపై ఆమె మాట్లాడారు. నాగార్జున ఒక్కరే ఈ షో వల్ల లాభ పడ్డారని ఆమె అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జునదే . నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోలో ఉంది. కాబట్టి బిగ్ బాస్ వలన అత్యధికంగా లాభపడుతుంది నాగార్జున మాత్రమే అన్నారు. నాకు డబ్బులు ఇచ్చారు. హౌస్లోకి వెళ్ళాను. నా అవసరం అయిపోయగానే ఎలిమినేట్ చేశారని ఆమె ఘాటైన విమర్శలు చేసింది. షకీలా కామెంట్స్ ని బట్టి… నాగార్జున ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఎన్ని విమర్శలు వచ్చినా బిగ్ బాస్ హోస్టింగ్ నుండి తప్పుకోవడం లేదనిపిస్తుంది.
Web Title: Do you know why nagarjuna is not leaving bigg boss despite criticism
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com