Photo Story: మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ 2 మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ మూవీ స్టోరీతో పాటు నటుల యాక్షన్ పై ప్రత్యేకంగా చర్చించుకుంటారు. ముఖ్యంగా ఇందులో జూనియర్ ఐశ్వర్య రాయ్ గా నటించిన ఓ అమ్మాయిని చూసి అంతా షాక్ అయ్యారు. మిల్క్ బ్యూటీకి మించిన అందంతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఇదివరకు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించారు. కానీ పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఆమె ఫేమస్ అయింది. ఆమెను చూసిన కొందరు ఐశ్వర్యరాయ్ కి మించిన అందం ఆమె సొంతం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో చూద్దాం.
మిల్క్ బ్యూటీకి పోటీనిస్టున్న ఈమె పేరు సారా అర్జున్. 2005లో జన్మించిన ఈమె ముంబైలో జన్మించారు. ఈమె ఓసారి తన తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ కు వెళ్లినప్పుడు ఓ యాడ్ కంపెనీ వాళ్లు చూసి ఇంప్రెస్ అయ్యారు. అలా మొదటి సారిగా రెండేళ్ల వయసులోనే సారా అర్జున్ డైరెక్టర్ విజయ్ కోసం ఓ యాడ్ లో కనిపించింది. ఇందులో ఆమె యాక్టింగ్ కు మెచ్చిన పలువురు సినిమాల్లో తీసుకోవాలని చూశారు. దీంతో ఆమెకు ‘దైవ తిరుమగల్’ లో నటించింది. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో నటించింది.
సారా అర్జున్ తెలుగులో మొదటిసారిగా ‘దాగుడుమూత దండాకోర్’ అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పక్కన కనిపించారు. అయితే తెలుగులో ఆమెకు అవకాశాలు రాకపోవడంతో తమిళం, హిందీ సినిమాల్లో నటించారు. వీటితో తెలుగు డబ్ అయిన ‘నాన్న’ చిత్రంలో సారా అర్జున్ కీలక పాత్ర పోషించారు. ఒక దశలో ఆమెకు ఈ చిత్రం తరువాతే సరైన గుర్తింపు వచ్చింది. అయితే కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన తరువాత మణిరత్నం ఆమెను మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చారు. అలా ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాల్లో కనిపించారు. పార్ట్ వన్ లో సారా కనిపించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు.
పీఎస్ 2 లో ఆమె పర్ఫామెన్స్ నచ్చడంతో చాలా మంది ఆమె గురించి చర్చించుకుంటున్నారు. జూనియర్ ఐశ్వర్యరాయ్ పాత్రలో నటించిన ఆమెకు ఐశ్వర్యకు మించిన అందం ఉందని తెగ పొగిడేస్తున్నారు. ఇకఆ మె లేటేస్టు ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. త్వరలో ఈమె టాప్ హీరోయిన్ గా కొనసాగుతుందని అంటున్నారు. చూద్దామం మరి సారా అర్జున్ ఏ రేంజ్ లోకి వెళ్తుందో.
అన్నట్లు సారా అర్జున్ సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు. ఈమె తండ్రి సారా .. బాలీవుడ్ హీరో. తెలుగులో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించారు. తండ్రి వారసత్వంతో చిన్నప్పుడే ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన సారా.. ఇప్పడు ఫేమస్ అయిందనే చెప్పాలి. మరి ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెల్తుందా? లేదా చూడాలి. ఒకవేళ ఆ రేంజ్ కు వెళ్తే మాత్రం బ్యూటీ కి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.