https://oktelugu.com/

Sudigali Sudheer : ఎట్టకేలకు సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్… కాబోయే భార్య ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఆమె విదేశాల్లో చదువుకుంటుంది. ఆమె చదువు పూర్తయిన వెంటనే సుధీర్ తో వివాహం జరిపిస్తారట. దీనిపై త్వరలో అతని కుటుంబ సభ్యులు ప్రకటన చేయబోతున్నారు అని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ న్యూస్ వైరల్ అవుతుంది. మరోవైపు సుధీర్ బుల్లితెర షో లకు గుడ్ బై చెప్పేశాడు. సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. త్వరలో ' గోట్ ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2024 / 09:19 AM IST

    Sudigali Sudheer fiancee

    Follow us on

    Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ బుల్లితెర కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి హీరో రేంజ్ కి ఎదిగాడు. ప్రస్తుతం ‘ గోట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. అతని పెళ్లి పై తరచూ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. తాజాగా సుధీర్ కి పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అతని పేరెంట్స్ సుధీర్ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఆ కథ ఏమిటో చూద్దాం..

    జబర్దస్త్ షో వేదికగా పాపులారిటీ తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రష్మీ గౌతమ్ – సుధీర్ లవ్ ట్రాక్ అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అదంతా కేవలం ఎంటర్టైన్మెంట్ లో భాగమే, తమ మధ్య అలాంటిది ఏమీ లేదని చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ రష్మీ, సుధీర్ నిజంగానే ప్రేమించుకుంటున్నారనే అనుమానాలు జనాల్లో ఉన్నాయి.

    కొందరు ఫ్యాన్స్ సుధీర్ – రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని కామెంట్లు పెడుతూ ఉంటారు. అంతలా ఈ జంట ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. ఇది పక్కన పెడితే తాజా సమాచారం ప్రకారం సుధీర్ కి పెళ్లి ఫిక్స్ అయిందట. ఈ నేపథ్యంలో అతడికి కాబోయే భార్య వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆమె సుధీర్ బంధువుల అమ్మాయి అని తెలుస్తుంది.

    ప్రస్తుతం ఆమె విదేశాల్లో చదువుకుంటుంది. ఆమె చదువు పూర్తయిన వెంటనే సుధీర్ తో వివాహం జరిపిస్తారట. దీనిపై త్వరలో అతని కుటుంబ సభ్యులు ప్రకటన చేయబోతున్నారు అని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ న్యూస్ వైరల్ అవుతుంది. మరోవైపు సుధీర్ బుల్లితెర షో లకు గుడ్ బై చెప్పేశాడు. సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. త్వరలో ‘ గోట్ ‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.