https://oktelugu.com/

Julayi Movie: షాకింగ్..’జులాయి’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా..? చేసుంటే ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలయ్యేవి!

అలాంటి సమయం లో ఆయన త్రివిక్రమ్ తో కలిసి చేసిన చిత్రం ఇది, త్రివిక్రమ్ కూడా అప్పట్లో మహేష్ బాబు తో 'ఖలేజా' వంటి భారీ డిజాస్టర్ సినిమాని తీసి వరస్ట్ ఫేస్ లో ఉన్నాడు. అలా ఈ ఇద్దరు కెరీర్ లో లౌ ఫేస్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా ఇది. ఆరోజుల్లోనే ఈ చిత్రం 43 కోట్ల రూపాయిల షేర్ మరియు ఓవర్సీస్ లో 1 మిలియన్ కి పైగా డాలర్స్ ని రాబట్టింది.

Written By: , Updated On : July 3, 2023 / 07:01 PM IST
Julayi Movie

Julayi Movie

Follow us on

Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ‘జులాయి’. ఈ సినిమా అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్ లో ఆశించిన స్థాయి విజయాలు లేవు. ఈ చిత్రానికి ముందు వచ్చిన వరుడు , వేదం మరియు బద్రీనాథ్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

అలాంటి సమయం లో ఆయన త్రివిక్రమ్ తో కలిసి చేసిన చిత్రం ఇది, త్రివిక్రమ్ కూడా అప్పట్లో మహేష్ బాబు తో ‘ఖలేజా’ వంటి భారీ డిజాస్టర్ సినిమాని తీసి వరస్ట్ ఫేస్ లో ఉన్నాడు. అలా ఈ ఇద్దరు కెరీర్ లో లౌ ఫేస్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా ఇది. ఆరోజుల్లోనే ఈ చిత్రం 43 కోట్ల రూపాయిల షేర్ మరియు ఓవర్సీస్ లో 1 మిలియన్ కి పైగా డాలర్స్ ని రాబట్టింది.

ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి, ఆ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమా ని ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో చెయ్యాలని అనుకోలేదట. ఈ సినిమాని ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసుకున్నాడు. అయితే ఖలేజా సినిమా అతి పెద్ద డిజాస్టర్ అవ్వడం తో మహేష్ బాబు కొంత కాలం మనం దూరంగా ఉంటే మంచిది అని త్రివిక్రమ్ తో స్వయంగా అన్నాడట. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాలేదు.

ఇప్పుడు ఇన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. అయితే జులాయి సినిమాని మహేష్ బాబు మిస్ చేసుకున్నాడు అనే వార్త ని విని ఆయన అభిమానులు అయ్యో ఎంత మంచి సినిమా మిస్ అయ్యింది అని బాధ పడుతున్నారు.